TSPSC ప్రశ్నాపత్రాల లీకు ఘటనలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా నిర్వహించిన SI, కానిస్టేబుల్ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక, ఈవెంట్స్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నెగెటివ్ మార్కులు ఉన్నప్పటికీ SI అభ్యర్థికి అత్యధికంగా 133 మార్కులు, కానిస్టేబుల్ అభ్యర్థికి 141 మార్కులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని లేదంటే ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.
ఏఈ పరీక్ష లీక్‌తో..
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ఏఈ పేపర్ లీక్‌తో బయటకొచ్చింది. పేపర్ని లీక్ చేసిన హిందీ పండిట్ రేణుక, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ డాక్యా నాయక్ దంపతులు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ని తీసుకున్నారు. అనంతరం రేణుక దంపతులు గోపాల్ నాయక్, నీలేశ్ నాయక్, రాజేంద్ర నాయక్‌లతో బేరం మాట్లాడి వనపర్తి జిల్లాకు తీసుకెళ్లారు. అక్కడే ప్రిపేర్ చేయించి మార్చి 5న పరీక్ష రాసేందుకు తీసుకొచ్చారు. పరీక్ష అనంతరం వనపర్తి వెళ్లి దావత్ చేసుకున్నారు. ఇక్కడే డబ్బులు ఇవ్వాలని రేణుక దంపతులు డిమాండ్ చేయడంతో నిందితులలో ఒకరు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
మరిన్ని ప్రశ్నాపత్రాలు లీక్..
తీగ లాగితే డొంక కదిలింది. వాస్తవానికి తొలుత ఒకే పేపర్ లీక్ అయిందని పోలీసులు భావించారు. కానీ, ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్‌డ్రైవ్‌లో మరిన్ని ప్రశ్నాపత్రాలు లభ్యమయ్యాయి. ఏఈ ప్రశ్నాపత్రంతోపాటు టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ కేసుతో సంబంధమున్న 9 మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండటం గమనార్హం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తు వేగవంతం..
సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసుతో ప్రమేయమున్న ప్రతి ఒక్కరిని అనుమానిస్తోంది. కమిషన్‌లోని మరికొంత మంది ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్ష రాశారట. వీరిలో 8 మందికి పైగా 100 మార్కులు వచ్చినట్లు తెలిసింది. దీంతో వీరికి కూడా సిట్ నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రేణుక, డాక్యా నాయక్ దంపతులను అధికారులు విధుల్లోంచి తొలగించారు. వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా శాఖలు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి