టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ త్వరలో వివాహం చేసుకోనున్నట్ల తెలుస్తోంది. 43 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ తమ దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవీకి ఆమె వరుసకు మరదలు అవుతుందని.. వారిద్దరి మధ్య 17 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు టాక్. పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దేవిశ్రీప్రసాద్ గతంలో ఓ టాప్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది.
ఇదిలా ఉంటే గతంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన దేవిశ్రీ ప్రసాద్.. కొంతకాలంగా డల్ అయ్యాడు. ఎస్.ఎస్ థమన్ రాకతో దేవి సినిమాల జోరుకు బ్రేకులు పడింది. ఏటా కనీసం 6-7 బడా సినిమాలు దేవి సంగీతంతో రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు ఏడాదికి ఒకటి రెండు రావడమే గగనంగా మారిపోయింది. అవకాశాలు మరింత సన్నగిల్లుతున్న సమయంలో ‘పుష్ప’ సినిమా దేవికి కొత్త ఆశలు చిగురించేలా చేసింది. పుష్ప పాటలు పాన్ ఇండియా రేంజ్లో హిట్ కావడంతో తిరిగి దేవి ఫామ్ అందుకున్నాడు. ఇటీవల ‘వాల్తేర్ వీరయ్య’ కూడా మ్యూజికల్‌గా హిట్ కావడంతో దేవి పుంజుకున్నట్లే కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం ‘పుష్ప2’ తో పాటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్తో ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ వార్తల్లో నిలిచాడు. భక్తిపాటలు, ఐటెం సాంగ్స్ ఒకటే అంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయి. కాగా, పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై దేవిశ్రీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై దేవి క్లారిటీ ఇస్తాడో? లేదో? చూడాలి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి