టాలీవుడ్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనగానే ముందుగా రామ్ పోతినేని గుర్తుకువస్తాడు. ఆయన నటించిన సినిమాలన్ని ఫుల్‌జోష్‌తో ఉంటాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా ప్రతీదానిలోనూ రామ్ తమదైన మార్క్‌ను చూపిస్తుంటాడు. తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతి తక్కువమంది హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. తెరపై రామ్ డ్యాన్స్‌ను ప్రేక్షకులు కళ్లు అప్పగించి మరి చూస్తుంటారు. తన మెుదటి సినిమా ‘దేవదాస్’తోనే తానేంటో రామ్ నిరూపించుకున్నాడు. కాగా, ఇవాళ రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ నేపథ్యంలో రామ్ తన డ్యాన్స్‌తో ఇరగదీసిన పాటలేంటో ఇప్పుడు చూద్దాం.
1. బుల్లెట్ (వారియర్)
రామ్ పోతినేని – కృతి శెట్టి జంటగా చేసిన సినిమా వారియర్. దేవిశ్రీ ఇచ్చిన సంగీతానికి రామ్ స్టెప్పులు తోడు కావడంతో ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఇందులో రామ్ రిబ్బన్ పట్టుకొని వేసే హుక్ స్టెప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అటు హీరోయిన్ కృతి శెట్టి కూడా రామ్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ అదరగొట్టింది.
2. ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ (ఇస్మార్ట్ శంకర్)
ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘ఇస్మార్ట్’ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రామ్ ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశాడు. కొత్త కొత్త స్టెప్పులతో వీక్షకుల మతి పొగొట్టాడు. శరీరాన్ని స్పింగ్‌లా తిప్పుతూ అలరించాడు. ముఖ్యంగా చార్మినార్ ముందు మోకాళ్లపై చేసే స్టెప్పు ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. రామ్ బెస్ట్ డ్యాన్సింగ్ వీడియోల్లో ‘ ఇస్మార్ట్’ పాట కచ్చితంగా టాప్-5లో ఉంటుంది.
3. వాట్ అమ్మా (ఉన్నది ఒకటే జిందగీ)
రామ్ డ్యాన్స్ అంటే స్పీడు స్టెప్పులకు పెట్టింది పేరు. అటువంటి రామ్ స్లో డ్యాన్స్‌లోనూ అదరగొట్టగలనని నిరూపించుకున్నాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని ‘వాట్ అమ్మా’ అనే పాటలో రామ్ డ్యాన్స్ అప్పటివరకూ చేసిన దానికంటే భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా సాగే పాటకు తగ్గట్లు స్టెప్పులు వేసి రామ్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా చేశారు.
4. డిచుకు డిచుకు డంకా (రెడ్)
రెడ్ సినిమాలోని డిచుకు డిచుకు డంకా ఐటెం సాంగ్‌లో రామ్ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. ఐటెం డాల్ హెబ్బపటేల్‌ను టీజ్ చేస్తూ సాగే ఈ పాటలో రామ్ స్టెప్స్ ఆకట్టుకుంటాయి. ఈ పాట యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
5. కల్లోకి దిల్లోకి (మస్కా)
రామ్ – హన్సిక జంటగా చేసిన మస్కా సినిమా తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులోని అన్ని పాటలు అప్పట్లో యమా క్రేజ్‌ను సంపాదించాయి. ముఖ్యంగా కల్లోకి దిల్లోకి పాట ప్రతీ ఫంక్షన్లలో వినిపించేది. ఇందులో రామ్ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. సాంగ్‌కు తగ్గట్లే ఫుల్ జోష్‌తో స్టెప్పులు వేశాడు. ఇందులో మోకాళ్ల మీద వేసే స్టెప్పులు.. ట్రైనింగ్ లేకుండా వేయవద్దని సాంగ్‌లో స్క్రోల్ కూడా వచ్చింది.