సంక్రాంతికి విడుదలై థియేటర్స్‌లో సంచలన విజయం సాధించిన హనుమాన్ (HanuMan) చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చి అదే జోరును కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ‘హనుమాన్’ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 17) ‘జీ 5’ (Zee 5) వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చి ‘హనుమాన్’ అందర్ని సర్‌ప్రైజ్ చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఈ బ్లాక్ బాస్టర్ చిత్రం ఓటీటీలోకి రావడంతో ‘హనుమాన్’ను చూసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. దీంతో విడుదలైన కొన్ని గంటల్లోనే హనుమాన్ ఓటీటీ వేదికగా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ‘హనుమాన్’ ఓటీటీ వెర్షన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ట్రెండింగ్‌లో ‘హనుమాన్’
వాస్తవానికి శివరాత్రి సందర్భంగా మార్చి 8న ‘హనుమాన్’ విడుదలవుతుందని అంతా భావించారు. కానీ అలా జరగకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇటీవల హనుమాన్ హిందీ వెర్షన్ రిలీజ్ డేట్‌ను ప్రకటించి తెలుగు వెర్షన్‌పై మౌనం వహించడం ఫ్యాన్స్‌కు మరింత ఆగ్రహం తెప్పించింది. అయితే ఆడియన్స్ సర్‌ప్రైజ్ చేస్తూ మేకర్స్ జీ 5 వేదికగా హనుమాన్‌ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ప్రస్తుతం ‘జీ 5’లో అత్యధిక వీక్షణలతో హనుమాన్ టాప్-1 లో దూసుకెళ్తోంది. రిలీజైన 11 గంటల్లోనే 102 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ నమోదు చేసినట్లు ‘జీ 5’ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన తెలుగు చిత్రాల్లో తక్కువ సమయంలో అత్యంత వేగంగా ఓటీటీ వీక్షణలను పొందిన చిత్రం ఇదేనని పేర్కొన్నాయి.
హిందీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ చిత్రం.. ప్రస్తుతం హిందీలో ‘జియో సినిమా’ (Jio Cinema) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీలోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నట్లు పేర్కొన్నాయి. థియేటర్‌లో చూసిన వారు సైతం మళ్లీ ఓటీటీలో హనుమాన్‌ను చూస్తున్నట్లు తెలిపాయి. హిందీలో పలు ఓటీటీ రికార్డులను కొల్లగొట్టే దిశగా హనుమాన్ దూసుకెళ్తున్నట్లు సమాచారం. కాగా, థియేటర్లలో రిలీజైన దగ్గర నుంచి ‘హనుమాన్’కు నార్త్‌లో మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.
ఆ 8 నిమిషాలు ఏమైనట్లు?
హనుమాన్ ఓటీటీలోకి వచ్చింది కానీ.. ఈ మూవీ రన్ టైమ్ థియేటర్లలో కంటే తక్కువగా ఉండటం ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తోంది (Hanuman disappointed the OTT audience). థియేటర్లలో ఈ సినిమా నిడివి 2 గంటల 38 నిమిషాలుగా ఉంది. కానీ జీ5 ఓటీటీలో మాత్రం 2 గం.ల 30 నిమిషాలే ఉండటం గమనార్హం. అంటే 8 నిమిషాల సినిమాను కట్ చేశారా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమా నిడివి పెరగాలి. డిలీటెడ్ సీన్స్‌ను సైతం జత చేసి మరి మేకర్స్ ఓటీటీలో తమ మూవీని రిలీజ్ చేస్తుంటారు. కానీ ఇందుకు రివర్స్‌గా హనుమాన్ నిడివి తగ్గడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగు కంటే హిందీలోనే బెటర్!
‘హనుమాన్’ సినిమా సౌండ్ క్వాలిటీ కూడా థియేటర్లతో పోలిస్తే చాలా పూర్‌గా ఉందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఆడియో క్వాలిటీ బాగా లేదని కొందరు వాపోయారు. డైలాగ్స్ సరిగా వినిపించకపోవడం, బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సడెన్‌గా ఎక్కువ సౌండ్‌తో రావడంలాంటివి జరిగినట్లు పేర్కొన్నారు. దీంతో సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేసినట్లుగా ఓటీటీల్లో చేయలేకపోతున్నామని చెప్పారు. అంతేకాదు తెలుగు వెర్షన్‌తో పోలిస్తే ‘జియో సినిమా’లోని హిందీ వెర్షన్ చాలా మెరుగ్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
రికార్డు వసూళ్లు
డివోషనల్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది