• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Arshad Warsi: అర్షద్‌ వార్సీ కామెంట్లపై స్పందించిన నాగ్ అశ్విన్ 

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas)పై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi) చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్‌ పాత్రను జోకర్‌తో పోలుస్తూ అతడి చేసిన వ్యాఖ్యలను ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టాలీవుడ్‌ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో రాణించడం చూసి తట్టుకోలేకనే బాలీవుడ్‌ ప్రముఖులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి. బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో టాలీవుడ్‌పై ఈర్ష్య, ద్వేషం, అసూయ మరోమారు బయటపడిందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. 

    ‘అర్షద్‌ హుందాగా మాట్లాడాల్సింది’

    బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ వ్యాఖ్యలపై నాగ్‌ అశ్విన్‌ తాజాగా స్పందించారు. కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని పోస్టు చేసిన నెటిజన్‌, ఈ ఒక్క సీన్‌ బాలీవుడ్‌ ఇండస్ట్రీ మెుత్తంతో సమానమని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ పోస్టుకు నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇస్తూ టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని విడదీసి మాట్లాడొద్దని సూచించారు. ‘నార్త్‌-సౌత్‌, టాలీవుడ్‌ వెర్సస్‌ బాలీవుడ్‌ ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమే. అర్షద్‌ హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. మేము అతడి పిల్లల కోసం కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తాం. కల్కి రెండోభాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తాను’ అని రాసుకొచ్చారు. ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి అని నాగ్‌అశ్విన్‌ చెప్పారు. ప్రభాస్‌ కూడా ఇదే మాట అంటుంటారని ఆయన తెలిపారు.

    అర్షద్‌కు నాని చురకలు

    ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని కూడా తనదైన శైలిలో స్పందించారు. ప్రభాస్‌పై విమర్శలు చేయడం వల్ల అర్షద్ వార్సీకి గతంలో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ లభించిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. నాని వ్యాఖ్యలపై బాలీవుడ్ ఆడియన్స్‌, అర్షద్ వర్సీ ఫ్యాన్స్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ‘సరిపోదా శనివారం’ హిందీ వెర్షన్ ప్రమోషన్స్‌ కోసం నాని ముంబయికి వెళ్లారు. అక్కడ ఓ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అర్షద్‌పై తాను చేసిన కామెంట్స్‌కు చింతిస్తున్నట్లు తెలిపారు. ‘మున్నాభాయ్’ సినిమాతో అర్షద్ దేశవ్యాప్తంగా అందరికీ చేరువయ్యాడని నాని గుర్తుచేశారు. అలాగే నటులుగా ఉన్నప్పుడు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా అవసరమని పరోక్షంగా చురకలు వేశారు. 

    ‘యాంటి ఇండియన్‌ అర్షద్‌’

    సోషల్ మీడియా వేదికగా అర్షద్‌ వార్సీపై పెద్ద ఎత్తున ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దాడి చేస్తున్నారు. అంతటితో ఆగకుండా గతంలో అర్షద్‌ చేసిన వివాదస్పద పోస్టులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ అర్షద్‌కు సంబంధించిన పాత కాంట్రవర్సీ పోస్టును బయటపెట్టాడు. 2012లో అర్షద్‌ చేసిన ట్వీట్‌ అది. ‘నేను అఫ్గనిస్తాన్‌ ఓ మీటింగ్‌ కోసం వెళ్తున్నాను. కుదిరితే షిఫ్ట్‌ అయిపోతాను. ఇండియా కంటే అక్కడ సేఫ్‌’ అంటూ అర్షద్‌ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టును రిట్వీట్‌ చేసిన ఓ నెటిజన్ దానికి ఫన్నీగా బ్రహ్మీ టెర్రరిస్టు గెటప్‌లో ఉన్న ఫొటోను జత చేశాడు. దీంతో ఈ పోస్టును ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ వైరల్‌ చేస్తున్నారు. ‘యాంటి ఇండియన్‌ అర్షద్‌’ అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రభాస్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

    తెలుగు హీరోల స్ట్రాంగ్‌ కౌంటర్‌

    ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు ఇటీవల తనదైన శైలిలో స్పందించాడు. విమర్శించడం తప్పు కాదని అయితే నోరు పారేసుకోవడం ముమ్మాటికీ తప్పే అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడ్డాడు. ఇలాంటి ప్రొఫెషనలిజం లేని మాటలు అర్షద్‌ వార్సీ నోటి నుంచి వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నాడు. ఇలాంటి చిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్లు చేసే కామెంట్స్‌ స్టాట్యూ లాంటి ప్రభాస్‌ను తాకలేవని స్పష్టం చేశాడు. అటు యువ నటుడు ఆది సాయికుమార్‌ సైతం అర్షద్‌ వ్యాఖ్యలను తప్పుబట్టాడు.  అర్షద్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా మండిపడ్డారు. ‘ఎటువంటి అభద్రతాభావం లేని నటుడు ప్రభాస్ అన్న. ఆయన లేకపోతే అసలు కల్కి సినిమాయే లేదు. నిజానికి తన రోల్ చాలా అద్భుతంగా ఉందనిపించింది. ఆయనంటే అసూయేమో’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv