• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Toxic Movie కేజీఎఫ్‌ హీరో యష్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌.. అర్థాంతరంగా ఆగిపోయిన ‘టాక్సిక్‌’?

    ‘కేజీఎఫ్‌’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్‌ (Yash) పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) సైతం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడంతో నేషనల్‌ వైడ్‌గా అతడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరింత బలపడింది. దీంతో అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘టాక్సిక్’ (Toxic) అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను యష్‌ పట్టాలెక్కించాడు. ఇందులో యష్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయగా అది విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. దీంతో ‘టాక్సిక్’ కూడా బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అంతా భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

    నమ్మకం కోల్పోయిన యష్‌!

    కేజీయఫ్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘కేజీఎఫ్‌ 2’ తర్వాత సాలిడ్‌ ప్రాజెక్ట్‌ కోసం బాగా గ్యాప్‌ తీసుకున్న యష్ ఇటీవలే ‘టాక్సిక్‌’ (Toxic)ను పట్టాలెక్కించాడు. లేడీ డైరెక్టర్‌ గీతు మోహన్‌దాస్‌ (Geetu Mohandas) పై నమ్మకముంచి ఈ ప్రాజెక్ట్ చేసేందుకు అంగీకరించాడు. ఈ మూవీలో నయనతార (Nayanthara), శ్రుతి హాసన్‌ (Shruti Hassan), కియారా అద్వానీ (Kiara Advani)ని హీరోయిన్లుగా ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇంటర్నేషనల్‌ డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానున్నట్లు కామెంట్స్‌ వినిపించాయి. అయితే షూటింగ్ కూడా కొంతవరకూ జరిగాక డైరెక్టర్‌ గీతూ మోహన్‌ దాస్‌ టేకింగ్‌పై యష్‌ సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. ఆమె ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ఆమె హ్యాండిల్‌ చేయలేదని యష్‌ భావిస్తున్నారట. దీంతో టాక్సిక్‌ను మధ్యలోనే అతడు ఆపేసినట్లు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  

    అందులో వాస్తవమెంత?

    ప్రస్తుతం ‘టాక్సిక్‌’ ఆగిపోయినట్లు నెట్టింట జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ‘టాక్సిక్‌’ సినిమా ఆగిపోవడం వాస్తవమేనని అలా అని పూర్తిగా రద్దు కాలేదని ఫిల్మ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా సినిమాను నిలిపివేసినట్లు చెబుతున్నాయి. అంతా సెట్‌ కాగానే త్వరలోనే షూటింగ్‌ పునఃప్రారంభం అవుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. 2025 మిడిల్‌ నాటికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో యష్‌ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్‌కు మించి టాక్సిక్‌ ఉండేలా చూడాలని చిత్ర బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

    ప్రభాస్‌తో పోటీ లేనట్లే!

    వాస్తవానికి ‘టాక్సిక్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావించింది. అయితే అదే రోజున ప్రభాస్‌ – మారుతీ కాంబోలో రూపొందుతున్న ‘రాజా సాబ్‌’ రిలీజ్‌ కానుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్ ఫైట్‌ తప్పదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ‘టాక్సిక్‌’ షూటింగ్‌కు బ్రేక్ రాడవంతో 2025 ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్‌ కావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో ప్రభాస్‌- యష్‌ మధ్య ఎలాంటి పోటీ ఉండకపోవచ్చని అంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జూన్‌-జులైలో టాక్సిక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్‌ ఉంది. 

    ‘కేజీఎఫ్‌’తో యష్‌ కెరీర్ మలుపు!

    ‘కేజీఎఫ్‌కు’ ముందు యష్‌ కన్నడలో 19 చిత్రాల్లో నటించాడు. అన్ని మూవీస్‌ చేసినప్పటికీ అతడికి ఆశించిన స్థాయిలో స్టార్‌ డమ్‌ రాలేదు. టైర్‌-2 హీరోగా మాత్రమే శాండిల్‌వుడ్‌లో కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘కేజీఎఫ్‌’ (KGF) చేశాడో అతడి లైఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో అతడి గురించి చర్చించుకున్నారు. ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) చిత్రం మరింత సక్సెస్‌ కావడంతో ఆ ఫేమ్‌ మరింత బలపడింది. దానిని నిలబెట్టుకునే క్రమంలోనే యష్‌ ఆచితూచి అడుగువేస్తున్నాడు. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌ 2 తర్వాత సరైన సబ్జెట్‌ కోసం రెండేళ్ల పాటు ఎదురు చూశాడు. రీసెంట్‌గా ‘టాక్సిక్‌’ను పట్టాలెక్కించాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv