• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: ‘నరబలి జరిగితే.. నా సినిమా హిట్టని అల్లు అర్జున్‌ అన్నాడు’.. కాంగ్రెస్‌ MLA షాకింగ్ కామెంట్స్

    హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం.. ఆపై వెంటనే అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి కౌంటర్‌ ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే జేఏసీ నేతలు బన్నీ ఇంటిపై రాళ్లదాడి కూడా చేశారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను పిలిపించి మూడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ నేపథ్యంలో బన్నీపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. పగటి వేషగాడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

    ‘సీఎంను అంటే ఖబర్దార్‌’

    అల్లు అర్జున్‌పై నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rekulapally Bhoopathi Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ‘పుష్ప అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమానా? స్మగ్లర్ సినిమా అది. ఎర్రచందనం అమ్ముకోడానికి నువ్వు చేసిన దందాలన్నీ చూపించినావ్‌. నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఖబర్దార్‌’ అంటూ హెచ్చరించారు. 

    ‘నువ్వు ఆంధ్రోనివి’

    అల్లు అర్జున్‌ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటూ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండిపడ్డారు. ‘నువ్వు ఆంధ్రోనివి.. ఆంధ్రోడిలా ఉండు. ఇక్కడ బతకడానికి వచ్చినావ్‌. మీకిచ్చిన గౌరవాన్ని కాపాడుకొని ఇక్కడ వ్యాపారం (సినిమాలు) చేసుకో. మా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే ఊరుకోం. తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏముంది?’ అంటూ తీవ్రంగా విమర్శించారు. 

    ‘నీ సినిమాలు ఆడనివ్వం’

    అల్లు అర్జున్‌ ఇంటిని ఓయూ జేఏసీ నేతలు ముట్టడించిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడిన సదరు ఎమ్మెల్యే మరిన్ని హెచ్చరికలు జారీ చేశారు. ‘కొంత మంది జాయింట్ యాక్షన్‌ కమిటీ వారు ఏదో చేసినట్లు ఉన్నారు. బన్నీ పద్దతి మార్చుకోకుండా ఉంటే కాంగ్రెస్‌ శ్రేణులు కూడా రంగంలోకి దిగుతాయి. నీ సినిమాలు కూడా ఆడనివ్వం. ఒళ్లు దగ్గరపెట్టుకొని సీఎం గురించి మాట్లాడు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

    ‘నరబలి జరిగిందన్నాడు’

    సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడినప్పుడు ఓ విషయాన్ని దాచారని ఎమ్మెల్యే అన్నారు. జరిగిన సంఘటన ఇదంటూ సంచలన ఆరోపణలు చేశారు. “తొక్కిసలాటలో ఒక లేడీ చనిపోయింది. ‘ఏసీపీ వెళ్లి మహిళ చనిపోయింది.. ఓ బాబు తీవ్రంగా గాయపడ్డాడు.. సార్‌ మీరు ఇక్కడ ఉండకండి వెళ్లిపోండి’ అంటే ఆయన ఏమంటాడో తెలుసా. ‘నరబలి అయిపోయింది సినిమా హిట్‌ అవుతుంది’ అన్నారు. ఆయనకు మానవత్వం ఉందా” అంటూ మండిపడ్డారు. ‘నీ పని నువ్వు చేసుకో.. లేదంటే చప్పుడు చేయకుండా ఆంధ్రాకి వెళ్లిపో’ అని సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv