2024 ఏడాది ముగియనుంది. కొత్త ఏడాదిలో బాక్సాఫీస్ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి.పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్టైన్ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం. ‘
కొత్త ఏడాది తొలి రోజున పెద్ద సినిమాలు ఏవి తెలుగు నుంచి విడుదల కావడం లేదు. డాకూ మహరాజ్, గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన మార్కో చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా, హనీఫ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ (Marco). ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. రూ.30కోట్లతో నిర్మించిన ఈ చిత్రం విడుదలైన వారంలో రోజుల్లోనే రూ.80కోట్లు కొల్లగొట్టి విజయపథంలో దూసుకెళ్తోంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light) అనే చిత్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ చిత్రాన్ని చూసిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారు, ఆయనకు ఈ చిత్రం ఎంతో నచ్చిందట. ఈ చిత్రాన్ని ప్రతిభావంతమైన దర్శకురాలు పాయల్ కపాడియా రూపొందించారు. ప్రధాన పాత్రల్లో కని కుశ్రుతి మరియు దివ్య ప్రభ నటించారు. ముంబై నగరంలోని ఇద్దరు నర్సుల జీవితాలను ఈ కథలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథ ఓ రోడ్ ట్రిప్ వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పులను తెలియజేస్తుంది. ప్రేమ కోసం కలలు కనే హృదయాలు, ముంబై నగరంలో ఒక తలదాచుకునే గూడు కోసం అలమటించే పేదల ఆవేదనను పాయల్ కపాడియా ఎంతో హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఈ చిత్రాన్ని డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా జనవరి 3 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ అద్భుతమైన కథను చూడటానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈవారం ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు
Platform | Title | Type | Release Date |
Netflix | Avisi | Documentary | December 31 |
Don’t Die | Hollywood Movie | January 01 | |
Missing Yeah | Web Series | January 01 | |
Re Union | Hollywood Movie | January 01 | |
Love Is Blind | Web Series | January 01 | |
Selling the City | Web Series | January 03 | |
When the Stars Gossip | Web Series | January 04 | |
Amazon Prime | Gladiator 2 | Hollywood Movie | January 01 |
The Rig | Web Series | January 02 | |
Guna | Hindi Movie | January 03 | |
Aha | Jolly O Jin Khana | Tamil Movie | December 30 |
Book My Show | Christmas Eve in Miller’s Point | Hollywood Movie | December 30 |
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?