వేసవికాలంలో మామిడిపండ్లు వచ్చేశాయి. ప్రస్తుతం రూ. 150 నుంచి 200లకు కిలో అమ్ముతున్నారు. ఒడిశా, మహారాష్ట్ర నుంచి పళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇందులో కొన్నింటికి కిలో రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అయితే, అల్ఫోన్సో లేదా హాపస్ అని పిలువబడే మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పిలుస్తుంటారు. వీటి ధర డజను రూ. 1500 నుంచి రూ.3000 వరకు పలుకుతోంది. ఈ లెక్కన తీసుకుంటే ఒక్కో మామిడి పండుకు రూ.200 పైగా ధర పలుకుతుంది. గోలంబర్ ప్రాంతంలో విక్రయిస్తున్న ఈ మామిడి పండ్లకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ప్రత్యేకమైన రుచి, సువాసన, తీపి కారణంగా ఎక్కువగా ఇష్టపడతారు.
హాపస్ మామిడి పండిన వారం రోజుల తర్వాత కూడా పాడవ్వకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుమార్గ్ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇటువంటి రకం పండ్లు చాలోచోట్ల దొరకవు. కేవలం కొన్ని ప్రత్యేకమైన స్టోర్లలోనే లభిస్తాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశంలో అత్యధికంగా మామిడి సాగు చేస్తారు. బంగిన్ పల్లి, కలెక్టర్ మామిడి, రసాలు, నీలవేణి, సువర్ణ, కొబ్బరి మామిడి ఇలా అనేక రకాలు పండిస్తారు. కానీ, ప్రపంచదేశాల్లో అత్యంత ఖరీదైన మామిడి భారతదేశానికి చెందినది కాదు. ఊదారంగులో కనిపించే ఆ మామిడిని మియోజాకి అంటారు. జపాన్‌లో కాస్తుంది. ఆ దేశంలోని మియాజాకి నగరంలో పండిస్తున్నందునే ఆ పేరు వచ్చింది.
ఈ మామిడి పండు బరువు సుమారు 350 గ్రాములు. 15% లేదా అంతకంటే ఎక్కువ చక్కెర కంటెంట్ కలిగి ఉంటుంది. అత్యంత నాణ్యమైన ఈ పండును తైయో నో, టొమాగో లేదా సూర్యరశ్మి గుడ్లుగా పిలుస్తుంటారు. వీటిని సాగు చేయాలంటే అధిక సూర్యరశ్మి, వెచ్చని వాతావరణం, పుష్కలంగా వర్షపాతం అవసరం. ప్రతి మామిడి పండు చుట్టూ రక్షిత వల ఉండాల్సిందే. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో మియోజాకి పండిస్తుంటారు.
జపాన్‌లో విక్రయించే అత్యధికమైన పండ్లలో ఇది కూడా ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో మామిడి రూ.2.70 లక్షలు. గతంలో ఈ పండ్లను సాగు చేసిన ఓ కుటుంబం నలుగురిని బాడీగార్డ్స్‌గా పెట్టిన సంగతి తెలిసిందే.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం