పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి నెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న చిత్రానికి బన్నీ ఏకంగా రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రూ.100 కోట్లుగా ఉన్న ప్రభాస్ మార్కెట్‌ను అల్లు అర్జున్ దాటేశారని ప్రచారం జరుగుతోంది. తద్వారా టాలీవుడ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా బన్నీ నిలిచాడని చెప్పుకుంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్, సందీప్ వంగా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. తగ్గేదే లే అనే డైలాగ్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు ఐకాన్ స్టార్. ప్రస్తుతం పుష్ప రెండో భాగానికి సంబంధించి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇందులో కూడా డైలాగ్స్‌తో సుకుమార్ ఇరగదీస్తున్నాడని టాక్. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మాటలనే రాస్తానంటూ దర్శకుడు చెప్పాడు.
ఒకవేళ పుష్ప చిత్రాన్ని మించి పార్ట్ 2 ఆడితే అర్జున్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. పాన్ ఇండియా మెుత్తం బాహుబలితో ప్రభాస్‌కు వచ్చినంత పేరు వస్తుంది. ప్రభాస్ స్థాయిని ఇప్పటికే సగం టచ్ చేసిన టాప్ హీరోకు భవిష్యత్‌లో క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా నిన్నటివరకు రూ. 60 కోట్ల వరకు తీసుకున్న అల్లు అర్జున్ ఒక్కసారిగా రెట్టింపు చేశాడని టాక్.
టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోలందరూ దాదాపు రూ.100 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నారు. పవన్ కల్యాణ్ రూ.50 నుంచి 75 కోట్లు, మహేశ్ బాబు రూ. 60 -80 కోట్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రూ.50 కోట్ల పైనే తీసుకుంటున్నారు. ప్రభాస్ మాత్రం బాహుబలి తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలకు రూ.100 కోట్లు తీసుకుని టాప్‌లో నిలిచాడు. దీంతో సందీప్ రెడ్డి వంగ చిత్రంతో ఈ రికార్డును అల్లు అర్జున్ బ్రేక్ చేశాడని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!