ఒక సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ అంతే కీలకం. కథానాయిక నటన, గ్లామర్, డ్యాన్స్ కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వెండి తెరపై తమ అందాల తార అందాలను చూసుకొని వారు మురిసిపోతుంటారు. హీరోయిన్లు కూడా గ్లామర్ ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేవారు.
అయితే ఇదంతా గతం. ఇప్పుడు డీ గ్లామరస్ రోల్‌లోనూ హీరోయిన్లు అదరగొడుతున్నారు. తెరపై గ్లామర్‌కు చోటు ఇవ్వకుండా కేవలం తమ నటనతోనే ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు పల్లెటూరి పాత్రల్లో తళ్లుక్కుముంటున్నారు. మట్టివాసన వెదజల్లే క్యారెక్టర్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. డీగ్లామర్ రోల్‌లో కనిపించి మెప్పించిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం.
కీర్తి సురేష్
దసరా(Dasara) మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్ (keerthi suresh) అదరగొట్టింది. వెన్నెల పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో కీర్తి నటన సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. హీరో నానితో పోటీపడి మరీ నటించింది. దీంతో నానితో సమానంగా కీర్తి సురేష్ ప్రశంసలు అందుకుంటోంది.
సమంత
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సమంత(Samantha) ‘రంగస్థలం (Rangasthalam)’ చిత్రంలో డీగ్లామరస్‌గా కనిపించింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. రామలక్ష్మీ పాత్రలో సమంతను తప్ప మరొకరిని ఊపించుకోలేము. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్‌లోనూ సమంత గ్లామర్‌కు దూరంగా ఉన్న పాత్రనే చేసింది.
అనుష్క
బాహుబలి(Bahubali) మెుదటి పార్ట్‌లో వృద్దురాలైన దేవసేనగా అనుష్క(Anushka Shetty) కనిపించింది. ఈ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భల్లాల దేవుడిపై పగ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న మహిళగా అనుష్క చాాాలా బాగా నటించింది.
తమన్నా
బాహుబలి పార్ట్-1 లోనే తమన్నా(Thamanna) కూడా అవంతిక పాత్రలో మెరిసింది. ఎలాంటి మేకప్ లేకుండా పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. గ్లామర్ పాత్రలే కాదు అందానికి ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు కూడా చేయగలనని తమన్నా నిరూపించుకుంది.
ఐశ్వర్య రాజేష్
‘కౌసల్య కృష్ణమూర్తి’ (Kousalya krishnamurthy), ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (world famous lover) లాంటి చిత్రాల్లో ఐశ్వర్య రాజేష్ డీ గ్లామరస్ రోల్స్‌లో నటించారు. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి యువతిగా ఐశ్వర్య అద్భుతంగా నటించింది. అయితే కౌసల్య కృష్ణమూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. వరల్డ్ ఫేమస్ లవర్‌లో ఐశ్వర్య పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.
రితికా సింగ్
వెంకటేష్ ప్రధాన పాత్రలో చేసిన గురు(Guru) సినిమా ద్వారా రితికా సింగ్ (Ritika Singh) తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలుత కూరగాయాలు అమ్ముకునే రాముడు పాత్రలో రితికా డీగ్లామరెస్‌గా కనిపించింది. ఆ తర్వాత బాక్సర్‌గా మారి సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది.
అమ్రితా అయ్యర్
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో అమ్రితా అయ్యర్ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం పాట’ (Neeli Neeli Aakasam) ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
సంజనా
బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంజనా (Sanjana).. దండుపాళ్యం-2 Dandupalyam-2)లో ఓ విభిన్నమైన పాత్ర పోషించి షాక్ ఇచ్చింది. హత్యలు చేసే గ్యాంగ్‌లో నటించి మెప్పించింది. ఇదే సినిమాలో సంజన న్యూడ్‌గా నటించిందన్న వార్తలు అప్పట్లో షికారు చేశాయి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!