• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!

  బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఓటీటీలో (Netflix) విడుదలైన యానిమల్‌ అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌ మూవీగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది. 

  మ్యూజిక్‌ రికార్డు

  ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో యానిమల్‌ ఈ అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఇండియాలో వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తొలి చిత్రంగా ‘యానిమల్’ (Animal Music Record) సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ (Spotify) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ‘యానిమల్‌’ పేరు నెట్టింట మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన సమాచారం #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (ట్విటర్‌)లో వైరల్ అవుతోంది. 

  హైలేట్‌ సంగీతం

  యానిమల్‌ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి దిమ్రితో రణ్‌బీర్‌ రొమాన్స్ చేస్తుండగా వచ్చే ‘ఎవరెవరో’ సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. అలాగే తండ్రిపై ప్రేమను చాటే ‘నాన్న నువ్వు నా ప్రాణం’.. క్లైమాక్స్‌తో వచ్చే ‘యాలో యాలో’ పాట కూడా మనసులను హత్తుకుంటాయి. ఇక ‘జమాలో జమాలో’ పాట ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్‌ను మ్యూజిక్ ప్రియులు రిపీటెడ్‌ మోడ్‌లో విన్నారు. మిగిలిన పాటలను సైతం తమ ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్టులో చేర్చేశారు.

  బీజీఎంతో గూస్‌బంప్స్‌

  అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఎలివేట్‌ చేసే క్రమంలో వచ్చే BGM గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. థియేటర్‌లో చూసిన వారు యానిమల్‌ నేపథ్య సంగీతాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మ్యూజిక్‌ లవర్స్‌ యానిమల్‌ BGMను తమ కాలర్‌ ట్యూన్‌గా, రింగ్‌టోన్‌గా పెట్టుకొని అస్వాదిస్తున్నారు. యానిమల్‌ బీజీఎం విన్నప్పుడల్లా తాము ఎంతో ఉత్తేజానికి గురవుతున్నట్లు పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు.

  లాభాలే లాభాలు.!

  డిసెంబర్ 1న రిలీజైన యానిమల్‌ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల పంట పండించింది. ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్‌ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్‌కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.    

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv