ఈ రోజుల్లో హీరో కావాలంటే డాన్సులు, నటన రావడమే కాదు ఫిజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. కండలు తిరిగిన దేహంతో హీరో తెరపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. అందుకే ఎంత కష్టమైన భరించి కథానాయకులు సిక్స్ ప్యాక్‌లు చేస్తుంటారు. పాత్రలకు అనుగుణంగా తమను తాము రూపాంతరం చేసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పాత్రలను బట్టి బరువు కూడా పెరగాల్సి ఉంటుంది. ఆ వెంటనే తదుపరి చిత్రం కోసం తమను ఫిట్‌గా మార్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దీన్ని బట్టి మన స్టార్ హీరోలు సినిమా పట్ల ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో అద్భుతమైన ఫిజిక్ కలిగిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
చిరంజీవి (Chiranjeevi)
ఇంద్ర సినిమా ముందు వరకూ టాలీవుడ్‌లో మంచి ఫిట్‌నెస్ కలిగిన హీరో అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు వచ్చాయి. శంకర్‌దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల వైపు వెళ్లిన చిరు బాడీని కాస్త అశ్రద్ధ చేశారు. తిరిగి సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన చిరు.. ఆరు పదుల వయసులోనూ ఫిట్‌నెస్ కోసం శ్రమిస్తున్నారు. ఇటీవల ‘విశ్వంభర’ సినిమా కోసం కఠిన వ్యాయామాలు చేస్తూ ఔరా అనిపించారు.
ప్రభాస్ (Prabhas)
టాలీవుడ్‌లో మెస్మరైజింగ్ బాడీ అనగానే ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గుర్తుకు వస్తారు. తొలి చిత్రం ఈశ్వర్ నుంచి ఫిట్‌గానే ఉన్న ప్రభాస్.. బుజ్జిగాడు సినిమా కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్ చేశాడు. ఆ తర్వాత బాహుబలి కోసం మరింత బరువు పెరిగి కండలు తిరిగిన యోధుడిలా ప్రభాస్ మారాడు. రీసెంట్‌గా ‘సలార్’లోనూ ప్రభాస్ పలకలు తిరిగిన బాడీతో కనిపించాడు.
రానా (Rana)
ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో గంభీరమైన దేహాన్ని కలిగిన హీరో రానా. తొలి సినిమా ‘లీడర్’లో బక్కపలచని బాడీతో కనిపించిన రానా.. ఆ తర్వాత పూర్తిగా రూపాంతరం చెందాడు. ‘కృష్ణం వందే జగద్గురం’లో కడలు తిరిగిన బాడీతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాహుబలి చిత్రం కోసం మరింత బరువు పెరిగి.. ప్రభాస్‌ను ఢీకొట్ట సమవుజ్జీలా మారాడు.
సుధీర్ బాబు (Sudheer Babu)
శివ మనసు శృతి (SMS) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన సుధీర్ బాబు.. తన బాడీతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తుంటాడు. బేసిక్‌గా జిమ్మాస్టర్ అయిన ఈ హీరో.. ప్రతీ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీని మెయిన్‌టైన్ చేస్తూ మెప్పిస్తున్నాడు.
రామ్ చరణ్ (Ram Charan)
మెగాస్టార్ వారసుడిగా ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్. తొలి సినిమాలో ఫిట్‌గా కనిపించిన చరణ్.. ‘మగధీర’కు వచ్చేసరికి ఎవరూ ఊహించని విధంగా కండలతో మెరిశాడు. ఇక ధ్రువ సినిమాలో ఏకంగా సిక్స్ ప్యాక్‌తో కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బ్రిటిష్ పోలీసు అధికారిగా కనిపించి మెప్పించాడు.
అల్లు అర్జున్ (Allu Arjun)
గంగోత్రి సినిమాతో లేలేత వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లుఅర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దేశముదురు చిత్రంతో తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించిన బన్నీ.. తన ఫిట్‌నెస్‌ను ప్రతీ సినిమాలోనూ కొనసాగిస్తూ వచ్చాడు. రీసెంట్ పుష్పలో తన పాత్ర కోసం బరువు పెరిగి కనిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
టాలీవుడ్‌లో ఫిట్‌నెస్ బాడీని కలిగి ఉన్న స్టార్ హీరోల్లో తారక్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో చాలా బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ‘యమదొంగ’ సినిమాతో సన్నగా మారిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లావైన తారక్.. ‘టెంపర్’లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’లోనూ దృఢమైన బాడీతో మెప్పించాడు.
రామ్ పోతినేని (Ram Pothineni)
లవర్ బాయ్‌లాగా క్యూట్‌గా కనిపించే రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్.. డబుల్ ఇస్మార్ట్ కోసం మళ్లీ సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య (Naga Shourya)
యంగ్ హీరో నాగ శౌర్య.. కెరీర్ ప్రారంభంలో డెసెంట్ సినిమాలు చేస్తూ సాఫ్ట్‌గా కనిపించాడు. ఇటీవల ‘లక్ష్య’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి మాస్ హీరోగా రూపాంతరం చెందాడు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మంచి హైట్, ఫిజిక్ కలిగిన విజయ్ దేవరకొండ.. ఇటీవల వచ్చిన ‘లైగర్’ సినిమాలో మెస్మరైజింగ్ బాడీతో అదరగొట్టాడు. బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ కావడంతో పాత్రకు తగ్గట్టు విజయ్ తనను తాను మార్చుకున్నాడు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ నటుల్లో అక్కినేని నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి ఒకటే బాడీని మెయిన్‌టెన్ చేస్తున్న నాగార్జున.. ‘ఢమరుకం’ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించారు.
సునీల్ (Sunil)
టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని బాడీ ట్రాన్సఫర్‌మేషన్ ఏదైనా ఉందంటే అది కమెడియన్ సునీల్ (Sunil)ది మాత్రమే. హాస్య పాత్రలు పోషించి రోజుల్లో చాలా లావుగా కనిపించిన సునీల్.. హీరోగా మారాక సిక్స్ ప్యాక్ చేశాడు. పూలరంగడు సినిమాలో ఆరు పలకల బాడీతో కనిపించి ఆడియన్స్‌ను షాక్‌కి గురి చేశాడు.