• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhagyashri Borse: పీకల్లోతు ప్రేమలో భాగ్యశ్రీ బోర్సే? ప్రియుడితో డేటింగ్‌ చేస్తున్నట్లు హింట్స్‌!

    యంగ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇదిలా ఉంటే భాగ్యశ్రీ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రియుడితో కలిసి డేటింగ్‌ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టును పరిశీలిస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 

    భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?

    ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే తన ప్రియుడితో కలిసి విహార యాత్రలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది’ అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్‌ చేస్తూ దానికి లవ్‌ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఇండైరెక్ట్‌గా హింట్‌ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్‌ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెడుతున్నారు. 

    ఫ్లాప్‌ వచ్చినా తగ్గని క్రేజ్‌!

    మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్‌ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. తాజాగా ‘కాంత’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. సరైన హిట్‌ లభిస్తే ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

    దుల్కర్‌కి జోడీగా భాగ్యశ్రీ

    మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్‌ సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయగా ఇటీవల పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్‌ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. 

    రౌడీ బాయ్‌తోనూ..

    విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12‘ చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ‘VD12’ రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్‌ స్టార్‌ నాని (Hero Nani) హీరోగా సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్‌ ఉంది.

    భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..

    భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం ‘యారియాన్ 2’తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv