TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. TSPSCని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు పలువురు బీజేపీ నాయకులు, శ్రేణులను అరెస్టు చేసి పరిస్థితిని అదుపు చేశారు.