టాలీవుడ్ అనగానే ముందుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)నే గుర్తుకు వస్తారు. ప్రస్తుత తరం హీరోలకి చిరంజీవి అంటే ఒక రోల్ మోడల్. అటు డైరెక్టర్లు సైతం చిరును అమితంగా అభిమానిస్తుంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు (Trivikram Srinivas)కు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఆయన్ను ఆదర్శంగా తీసుకొనే తాను ఇండస్ట్రీలోకి వచ్చినట్లు పలు వేదికలపై త్రివిక్రమ్ చెప్పారు. ఆ అభిమానంతోనే త్రివిక్రమ్ తన సినిమాల్లో చిరును రిఫరెన్స్‌గా (Megastar Chiranjeevi References In Trivikram Movies) తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? చిరును రిఫరెన్స్‌గా తీసుకున్న సందర్భం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
గుంటూరు కారం
సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం (Guntur Karam) చిత్రంలో మెగాస్టార్ (Megastar Chiranjeevi References In Trivikram Movies) చిరు పేరు వినిపిస్తుంది. పోలీసు స్టేషన్లో మహేష్ బాబు ఉండగా పోలీసు అధికారి ఏం చూసుకొని అంత బలుపు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహేష్.. తనకి వాళ్లని, వీళ్లని చూస్కొని బలుపు కాదని.. చిరంజీవి టైపు అంతా స్వయంకృషేనని అంటాడు.
జల్సా
జల్సా (Jalsa) సినిమాలోనూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నోట చిరు పేరును పలికించాడు త్రివిక్రమ్. ఒక సీన్లో రౌడీ నుంచి నిజం రాబట్టాలని పవన్ ప్రయత్నిస్తుంటాడు. అతడు ఎంతకీ చెప్పకపోవడంతో చిరులా స్వయం కృషి చేసి కనుక్కోవాలి అంటూ ఒక కొబ్బరి బొండాన్ని తీసుకుంటాడు. మరో సీన్లోనూ పవన్ నోటి వెంట చిరు పేరు వస్తుంది. రౌడీలను కొట్టే సీన్లో పవన్‌కు చేతికి రాడ్డు దొరుకుతుంది. చిరు సినిమా ఫస్ట్ డే రోజున రేర్‌గా టికెట్స్ దొరికినట్లు మనలాంటి వాళ్లకి ఇలా రాడ్డు దొరుకుతుందని పవన్ అంటాడు.
జులాయి
అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా జులాయి (Julayi)లోనూ చిరును రిఫరెన్స్‌గా తీసుకున్నారు త్రివిక్రమ్. డబ్బు సంపాదించడం అంత తేలికా అని తనికెళ్ల భరణి.. బన్నీని ప్రశ్నిస్తాడు. అప్పుడు టీవీలో చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా సీన్ ప్లే అవుతుంది. డబ్బు సంపాదించడం గొప్ప విషయం కాదంటూ చిరంజీవి ఆ సీన్లో చెప్తాడు.
అత్తారింటికి దారేది
ఈ సినిమా (Atharintiki Daaredi)లో పవన్ తన అత్త ఇంటికి డ్రైవర్‌గా వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. రిఫరెన్స్ కోసం హీరోలు డ్రైవర్లుగా నటించిన సినిమాలు చూస్తుండగా.. అప్పుడు చిరు గ్యాంగ్ లీడర్ మూవీలోని సీన్ వస్తుంది. ఆ సీన్ చూసిన పవన్ చాలా బాగా చేస్తున్నాడే అంటూ చిరును ప్రశంసిస్తాడు.
అలా వైకుంఠ పురంలో
ఈ సినిమా (Ala Vaikunthapurramuloo)లో చిరంజీవి పాటను రిఫరెన్స్‌గా తీసుకుంటారు త్రివిక్రమ్. ఓ సీన్లో చిరు పాటకు అల్లు అర్జున్ చేత డ్యాన్స్ వేయిస్తాడు. ‘అబ్బని తియ్యని దెబ్బ’ సాంగ్‌కు సునీల్, బన్నీ వేసే స్టెప్పులు అదరహో అనిపిస్తాయి.
నువ్వే నువ్వే
తరుణ్, శ్రియా జంటగా చేసిన నువ్వే నువ్వే (Megastar Chiranjeevi References In Trivikram Movies) సినిమాలోనూ చిరు ప్రస్తావన ఉంటుంది. తరుణ్ శ్రియా ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఆమె అన్న రాజీవ్ కనకాల కాల్ లిఫ్ట్ చేస్తాడు. మీరు ఎవరు? అని రాజీవ్ అడిగనప్పుడు తరుణ్ చిరంజీవి అని చెప్తాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది