[VIDEO](url): పెళ్లి వేడుకలో సరదాగా ఆడిపాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన..ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. నవంబర్ 5న జరిగిన ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. పిప్లాని ప్రాంతంలో తెలిసిన వారి పెళ్లి ఉందని మనోజ్ వెళ్లారు. అక్కడ వేదికపై చాలాసేపు స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశారు. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఏం జరిగిందని స్నేహితులు తెలుసుకునేలోపే మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.