భారతీయ చిత్ర పరిశ్రమల్లో కాంబినేషన్స్‌కు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు హీరోల కాంబో సెట్ అయ్యిందంటే సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు అంతా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జాతీయ స్థాయి దిగ్గజ నటులు ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ క్రేజీ కాంబో కోలివుడ్‌లో లాక్ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ హీరో నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతడు చేయబోయే చిత్రం ఏంటి? ఇప్పుడు చూద్దాం.
క్రేజీ కాంబో లోడింగ్..!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘కూలీ’ (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని వైజాగ్‌లో జరుగుతుండటం విశేషం. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ (Aamir Khan) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమీర్ ఖాన్ కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
29 ఏళ్ల క్రితమే..
రజనీకాంత్, అమీర్ ఖాన్ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 29 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆటంక్ హై ఆటంక్’ (Aatank Hi Aatank) అనే ఫిల్మ్‌లో వీరిద్దరు తొలిసారి నటించారు. అయితే ఇది ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియక పోవచ్చు. ‘ది గాడ్ ఫాదర్’ అనే నవల ఆధారంగా దర్శకుడు దిలీప్ శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జుహి చావ్లా ఫీమేల్ లీడ్‌గా కనిపించింది. అప్పట్లో రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అమీర్ ఖాన్, రజనీ నటనపై ప్రశంసలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరు మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విలన్‌గా కన్నడ స్టార్!
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనివిందు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్‌తో తెర పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో రజనీతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఉపేంద్ర విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
171వ చిత్రంగా కూలీ
తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా ‘కూలీ’ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు ‘విక్రమ్’ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి.
రజనీ వ్యాఖ్యలపై దుమారం
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై మంత్రి ఎ.వి. వేలు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాజాగా రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరుణా నిధి మరణం తర్వాత పార్టీని ప్రస్తుత సీఎం స్టాలిన్ చక్కగా నడిపిస్తున్నారని రజనీ అన్నారు. రాష్ట్ర మంత్రి దురై మురుగన్ పేరును ప్రస్తావిస్తూ ఆయన లాంటి పెద్దలున్న పార్టీని స్టాలిన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూ సరదాగా సెటైర్లు వేశారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి దురై మురుగన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి దురై మురుగన్ ఘాటుగా బదులిచ్చారు. సినిమా రంగంలోని పెద్ద నటులంతా వయసు మీరి, పళ్లు పోయి, గడ్డాలు పెంచుకొని చావబోయే స్థితిలోనూ నటిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి అన్నారు. అలాంటి వారి వల్ల యువకులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. ఈ పరస్పర మాటల దాడి కోలివుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్