జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల కాంబోలో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) లాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు 30 రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్ ఎడిటింగ్ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్ 15న టాప్ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్‌పై దేవర టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మూడో పాటకు రంగం సిద్ధం!
దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్ పెంచేశారు. ఇక దేవర థర్డ్ సాంగ్ మాస్ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కానునట్లు తెలుస్తోంది.
తారక్ డబుల్ షేడ్ చూశారా..
దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు ‘నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.
ప్రమోషన్స్‌పై ఫోకస్!
దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్