• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ లాక్‌.. అంచనాలు అందుకోలేకపోయిన చరణ్‌ బర్త్‌డే ట్రీట్‌! 

  ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Gamer Changer). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తుండటం, స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు రీజన్స్‌తో సినిమా షూట్‌ వాయిదా పడుతూ వస్తుండటంతో రిలీజ్‌ కూడా జరుగుతూ వస్తోంది. ఇక రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ తేదీని ప్రకటిస్తారని అంతా భావించినా లిరికల్‌ సాంగ్‌తో మేకర్స్‌ చేతులు దులుపుకున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ఓ వార్త బయటకొచ్చింది. 

  రిలీజ్‌ డేట్‌ లాక్‌?

  పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప 2’ (Pushpa 2), ‘దేవర’ (Devara) వంటి చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) పై అందరి దృష్టి పడింది. అసలు ఈ ఏడాది వస్తుందా రాదా అన్న సందేహాలు కూడా ఓ దశలో ఫ్యాన్స్‌లో మెుదలయ్యాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా రిలీజ్‌ తేదీ లాక్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండోచ్చని అంటున్నారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. 

  కాస్త ఓపిక పట్టండి: దిల్‌రాజు

  రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నిర్మాత దిల్‌రాజ్.. తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని కీలక అప్‌డేట్స్‌ కోసం కాస్త ఓపిక పట్టమని ఫ్యాన్స్‌ను కోరారు. ‘మీ ఓపికకు ఎంతో పరీక్ష పెడుతున్నాం. ఒక తుపాను వచ్చే ముందు కాస్త ఓపిక పట్టక తప్పదు. రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌ కాదు.. గ్లోబల్‌ స్టార్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి ఆ స్థాయికి రీచ్‌ అయ్యేలా శంకర్‌ దీనిని తీర్చిదిద్దుతున్నారు. మరో రెండు నెలల్లో షూట్‌ పూర్తి కానుంది. ఐదు నెలల్లో రిలీజ్‌ చేస్తాం’ అని అన్నారు. 

  రెస్పాన్స్ అంతంతమాత్రమే!

  మార్చి 27న చరణ్‌ బర్త్‌డే కానుకగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నుండి ‘జరగండి’ పాట విడుదలైంది. అయితే ఈ పాటకు రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. తమన్ రొటీన్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ ఉన్నా కూడా రామ్ చరణ్‌, కియారా స్టెప్స్ సో సోగానే ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుధవారం ఉ. 9 గంటలకు ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో రిలీజ్‌ కాగా.. గురువారం ఉ. 9 గంటల సమయానికి 4.5 మిలియన్‌ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. ఇక హిందీ, తమిళంలలో అయితే మరీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక దాంట్లో 3 లక్షలు, మరో దాంట్లో 5 లక్షల వ్యూస్‌తో జరగండి సాంగ్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

  ఒక్క సాంగ్‌కు అన్ని కోట్లా?

  యూట్యూబ్‌లో రిలీజైన ‘జరగండి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ను పరిశీలిస్తే అందులో రంగు రంగు భవనాలను చూడవచ్చు. ఈ సాంగ్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే అవన్ని ఒరిజినల్‌ భవనాలు కాదని.. చూడటానికి నిజమైన ఇల్లులా కనిపించే సెట్స్‌ అని టాక్‌ వినిపిస్తోంది. ఈ సెట్‌ నిర్మించడం కోసం ఏకంగా రూ.16 కోట్లను ఖర్చు చేశారని ఫిలింనగర్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే శంకర్‌ గురించి తెలిసినవారు ఇది మామూలు విషయమేనని అంటున్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv