• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GOLD RATES: బంగారం కొంటున్నారా? ఒక్క క్షణం..  అసలు ఇప్పుడు గోల్డ్ కొనొచ్చా? 

    దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో నిత్యం హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. తగ్గుతుందని సంబరపడేలోపే మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకానొక దశలో హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు 58 వేలు దాటింది. ఇలా పసిడి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మళ్లీ ఎందుకు తగ్గుతున్నాయి? ఇప్పుడు బంగారం కొనడం కరెక్టేనా? అనేది తెలుసుకుందాం.

    హెచ్చు తగ్గులు

    వారం రోజులుగా బంగారం ధరలను గమనించినట్లయితే భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పసిడి రేట్లు వరుసగా మూడు రోజులు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం మంగళ, బుధవారాలు కలిపి రూ. 990 ఎగబాకింది. కానీ, గురువారం రోజున కేవలం స్వల్పంగా రూ.100లు తగ్గి రూ. 53,050 వద్ద స్థిరపడింది. 

    మళ్లీ హుషార్

    పసిడి ధరలు ఇవాళ మళ్లీ షాకిచ్చాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు రూ. 500 పెరిగి రూ.53,550 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారేట్ల మేలిమి తులానికి రూ. 550 మేర పెరిగి రూ.58,240లకు చేరింది. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్లకు రూ. 500 పెరిగి రూ.53,700ల వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 58,570లకు ఎగబాకింది. 

    ఎందుకిలా?

    గతకొన్ని రోజులుగా పసిడి రేట్లు ఇలా హెచ్చు, తగ్గులు కావటానికి అంతర్జాతీయ సానుకూలతలు లేకపోవటమే కారణం. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలతో పాటు అమెరికాలో ఫెడ్ వాయిదా రేట్ల పెంపు నేపథ్యంలో డాలర్‌ విలువ పతనమవుతుంది. ఫలితంగా బంగారం, వెండి వంటివి పెరుగుతున్నాయి. 

    మరింత పెరగొచ్చు.

    వేసవి కాలం రానే వచ్చింది. అంటే, రానున్నది పెళ్లిళ్ల సీజన్. ఇలాంటి తరుణంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. కావున, పసిడి ధరలు ప్రజలకు చుక్కలు చూపించే అవకాశాలు లేకపోలేదు. 

    కొనచ్చా? లేదా?

    రేట్లు ఒకరోజు తగ్గటం, పెరగటం చూస్తుంటే ప్రజలు బంగారం కొనాలా? వద్దా? అనే ఆలోచనలో పడుతున్నారు. భవిష్యత్‌లో కాస్తైనా తగ్గే వరకు వేచి చూద్దాం అనుకునేవాళ్లు కూడా లేకపోలేదు. అయితే, బంగారం ధరలు రానురాను మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వివాహల సీజన్‌లో డిమాండ్‌ ఉండటంతో పాటు సానుకూల పవనాలు లేవనేది వారి అభిప్రాయం. 24 క్యారెట్ల పసిడి రూ. 60,000లు దాటేస్తుందని భావిస్తున్నారు. 

    వివాహా శుభకార్యాలు ఉన్న వారు తగ్గినప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదనేది నిపుణుల సలహా. ఇది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ప్రస్తుతం ఈ ధరల ముచ్చట కొంతమందిని ఆందోళనకు గురిచేస్తున్న మాట వాస్తవం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv