• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 

    రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం. 

    తేజ సజ్జ:

    యంగ్‌ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ప్రచార చిత్రాలు హనుమాన్‌ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 12న విడుదల కానుంది. 

    దేవ్‌దత్తా నాగే:

    అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న ఆదిపురుష్‌ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తున్నాడు. ఇందులో ఆంజనేయుడి పాత్రలో దేవ్‌దత్తా నాగే నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో సంఘర్ష్‌, సత్యమేవ జయతే, తానాజీ సినిమాల్లో దేవ్‌దత్తా నటించాడు. ఆయా సినిమాల్లో అద్బుతంగా చేయడంతో ఆదిపురుష్‌లో అత్యంత కీలకమైన హనుమాన్ పాత్ర దేవ్‌దత్తాకు దక్కింది. 

    చిరంజీవి:

    జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ సీన్‌లో ఆంజనేయుడిగా కనిపిస్తాడు. చిరు ఆంజనేయుడి వేషంలో కనిపించడం అదే తొలిసారి. హనుమాన్‌గా చిరు సరిగ్గా సరిపోయారని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఓ సందర్భంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి తనకు మధ్య ఉన్న పోలికలను చూపూతూ ట్వీట్లు కూడా మన మెగాస్టార్ చేశారు.

    అర్జున్‌:

    నితిన్‌ హీరోగా చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో అర్జున్‌ హనుమాన్‌ పాత్రను పోషించాడు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంతటి కఠినమైన రోల్‌ అయినా అలవోకగా చేయగలనని అర్జున్‌ ఈ సినిమా ద్వారా నిరూపించారు.

    రాజేంద్ర ప్రసాద్‌:

    నటుడు రాజేంద్ర ప్రసాద్‌ కూడా దేవుళ్లు సినిమాలో ఆంజనేయుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఆంజనేయుడి మేకప్‌లో కనిపించనప్పటికీ మారువేషంలో ఉన్న హనుమాన్‌గా ఆయన కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ చుట్టూ పాడే ‘అందరి బంధువయా’ పాట చాలా ఫేమస్‌ అయ్యింది. 

    విందు దర సింగ్‌:

    సినిమాల్లో ఆంజనేయుడు పాత్ర అంటే ముందుగా గుర్తుకువచ్చేది ‘విందు దర సింగ్‌’. రామాయణం కథాంశంతో తెరకెక్కిన చాలా సినిమాల్లో ఆయన హనుమాన్‌గా కనిపించారు. తెలుగు విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో కూడా హనుమంతుడి పాత్రలో కనిపించి విందు దర సింగ్ మెప్పించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv