లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా జులై 8న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే ప్రమోషన్స్‌ను కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసింది టీమ్. వాళ్లు మాట్లాడుకున్న ఫోన్ కాల్ లీక్ అయినట్లుగా.. దాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా టీవీలో చూపిస్తున్నట్లు వీడియోలు విడుదల చేశారు. మొదట కమెడియన్ సత్య, డైరెక్టర్‌తో మాట్లాడినా ఆడియోను విడుదల చేశారు. సినిమాలో నేనే హీరోను అని చెప్పి నువ్వు నన్ను మోసం చేశావు అంటూ డైరెక్టర్‌పై సత్య మండిపడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలో అగస్త్య నరేశ్ కూడా.. నాక్కూడా సినిమాలో నేనే హీరో అని చెప్పావు కదా. ఒక్కొక్కరికి ఒక్కోలా చెప్తున్నావు. నేను టీవీ చానల్‌లోనే ఉన్నా. డిబేట్‌కు రమ్మంటు ఛాలెంజ్ చేశాడు. హ్యాపీ బర్త్‌డే మూవీకి మత్తువదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్నాడు.