జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీ థియేటర్లలోనే కాదు…సోషల్ మీడియాలో కూడ ఒక సందడిని తీసుకొచ్చింది. భారీ అంచనాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో స్టార్ హీరోలు నటించడంతో ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడ వీక్షించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రముఖ మీడియా సంస్థ హిందూస్తాన్ టైమ్స్‌కి చెందిన రివ్యూవర్ మౌనిక రవల్ ఈ మూవీపై ట్వీట్ చేశారు. ‘మూవీలో నాటు నాటు అనే సాంగ్ అద్భుతంగా ఉంది. ఈ పాట వింటుంటే మనం సీట్లలో నుంచి లేచి డ్యాన్స్ చేస్తాం. ఎన్టీఆర్ ఎంట్రీ సూపర్ అనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే మరో రివ్యూవర్ సుచిన్ మెహ్రోత్ర తన అభిప్రాయాన్ని తెలిపాడు. ‘ఈ సినిమా బాహుబలి అంతకాకున్నా పర్లేదు అనిపించింది. రామరాజు స్ట్రెంజ్ క్యారెక్టర్, యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి, ఫ్రెండ్‌షిప్ లాంటి అంశాలతో సినిమాను చక్కగా తెరకెక్కించారంటూ’ ట్వీట్ చేశాడు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం