ఒకప్పుడు థియేటర్‌లో ఫ్లాప్ అయిన చిత్రాల పరిస్థితి మరి దారుణంగా ఉండేది. ఒకసారి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఇక అంతే సంగతులు అన్నట్లు వాటి పరిస్థితులు ఉండేవి. అయితే ఓటీటీ రాకతో ఈ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకొని చిత్రాలు సైతం కంటెంట్ బాగుంటే ఓటీటీలో రాణిస్తున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ (Honeymoon Express OTT Trending) చిత్రం ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. వీక్షకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రికార్డు వ్యూస్..
చైతన్య రావ్ (Chaitanya Rao), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. ఈ ఏడాది జూన్ 21 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. డిఫరెట్ కాన్సెప్ట్‌తోనే వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టులేకపోయింది. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 27న అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ చిత్రం క్రమంగా ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ఈ సినిమాను చూసిన వారంతా తమ ఫ్రెండ్స్‌కు సజిస్ట్ చేస్తుండటంతో అమెజాన్‌లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వ్యూస్ క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీలో 40 మిలియన్ల మినిట్స్‌తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మేరకు అమెజాన్ వర్గాలు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశాయి.
మూవీలో హైలెట్స్ ఇవే!
ప్రస్తుత తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద దర్శకుడు బాల రాజశేఖరుని ఈ సినిమాను రూపొందించారు. అందరినీ ఆకట్టుకునేలా, ముఖ్యంగా యూత్‌ను మెప్పించేలా కథ, కథనాన్ని ఎంగేజింగ్‌గా నడిపించారు. ఓ వృద్ధ జంట ఎంట్రీ ఇవ్వడం, హీరో హీరోయిన్లకు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ గేమ్ గురించి చెప్పడం, రిసార్ట్స్‌కు వెళ్లాకా ఆ జంట మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు యూత్‌ను కట్టిపడేస్తున్నాయి. కల్యాణ్ మాలిక్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఇక చైతన్యరావు, హెబ్బాపటేల్ మధ్య కెమెస్ట్రీ కూడా బాగా వర్కౌట్ కావడంతో థియేటర్లలో మిస్ అయిన యూత్ ఈ సినిమాను తెగ చూస్తున్నారు. అయితే కొన్ని సీన్స్ మరీ రొమాంటిక్‌గా ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్‌ను కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.
కథేంటి
ఇషాన్ (చైతన్య రావు), సోనాలి(హెబ్బా పటేల్) ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే వీళ్లిద్దరి ఆలోచన విధానం వేర్వేరుగా ఉంటాయి. సోనాలి చాలా ఫాస్ట్ అయితే.. ఇషాన్ నిదానం. దీంతో ఇద్దరి మధ్య తరచూ ఏదోక సమస్యలు వస్తుంటాయి. ఓ రోజు వీరికి సీనియర్ కపుల్స్ పరిచయమై హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెబుతారు. అలా వారిని ఓ రిసార్ట్‌కు పంపిస్తారు. ఇంతకీ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అంటే ఏంటి? దాని వల్ల ఇషాన్ – సోనాలి మధ్య గొడవలు సద్దుమణిగాయా? వీరి శృంగార జీవితం బాగుపడిందా? లేదా? అన్నది కథ.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!