హైదరాబాద్ ఖాజాగూడాలోని ఐటీ కారిడార్‌లో ప్రారంభించిన దక్షిణ్-5 అనే పరిమిత 56 సీట్స్ కలిగిన రెస్టారెంట్ ఆసక్తికరమైన డిస్కౌంట్లు ప్రకటించింది. భోజనం ఆర్డర్ చేసే పద్ధతిలోనే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. అదెలా అంటే ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు ‘please’, ‘thank you’, ‘have a nice day’ అని చెప్తే చాలు మీ ఫుడ్‌పై మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు థాలీని ఆర్డర్ చేసేటప్పుడు ‘a thali please’ అని ఆర్డర్ చేస్తే, అసలు ధర రూ.165 అయితే రూ.150కే లభిస్తుంది. ఒకవేళ ‘good afternoon’ చెప్పి ఆ తర్వాత ‘a thali please’ అని చెప్తే రూ.135 కే లభిస్తుంది. ఇలా ఎంత ఎక్కువ మర్యాద ఇస్తే అంత ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. మర్యాద ఇవ్వడం చాలా సాధారణ విషయం అయినప్పటికీ ఈమధ్య కాలంలో అది చాలా అసాధరణంగా మారింది. అందుకే ఆ సంస్కృతిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని హోటల్ దక్షిణ్-5 మేనేజింగ్ పార్టనర్‌లు ఎకె సోలంకీ, సంజీవ్ కుమార్ బ్లేక్ చెప్పారు. చాలాసార్లు కారణం లేకుండా సర్వ్ చేసేవాళ్లని కస్టమర్లు తిడుతుంటారు. వాళ్లు బాధపడటం మేము చూశాము. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
Representational Image

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్