పండ్లలో మామిడికి ఎంతో ప్రత్యేకమైన పేరు ఉంది. దీనిని పండ్ల రారాజుగా పిలుస్తారు. వేసవిలో మాత్రమే వచ్చే మ్యాంగోను ప్రతీ ఒక్కరూ మిస్ కాకుండా తింటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ పండుకు యమ క్రేజ్ ఉంది. కోటి మందికి పైగా జనాభా నగరంలో ఉండటంతో పెద్ద మెుత్తంలో మామిడి హైదరాబాద్‌కు వస్తుంటుంది. అయితే చాలా మంది నగరవాసులు తోపుడు బళ్ల దగ్గరే మామిడిని కొంటుంటారు. వారి చెప్పిన అధిక రేటుకే కొనుగోలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని ఫేమస్ పండ్ల మార్కెట్ వెళ్తే చాలా తక్కువ ధరకే మామిడి పండ్లు దొరికే అవకాశముంది. ఆ మార్కెట్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
కొత్తపేట ఫ్రూట్ మార్కెట్
ప్రస్తుతం నగరంలో కేజీ మామిడి పండ్ల ధర రూ. 70-100 వరకూ పలుకుతోంది. పండ్ల నాణ్యతను బట్టి రేటు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే తక్కువ ధరకు మామిడి పండ్లు కావాలంటే కొత్త పేట పండ్ల మార్కెట్‌లో ట్రై చేయోచ్చు. అక్కడ కేజీ మామిడి రూ.40-50కే దొరుకుతుంది. ఎక్కువ మెుత్తంలో మామిడి కొనుగోలు చేసినట్లైతే ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.
కోహెడా మార్కెట్
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా కోహెడా మార్కెట్‌కు పేరుంది. ఈ మార్కెట్ నుంచే పండ్లు, కూరగాయాలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ కూడా మామిడి తక్కువ ధరకే లభిస్తుంది. బంగినపల్లి, తోతాపురి, దశేరి, కేసర్, హిమాయత్, సువర్ణరేఖ, రసాలు ఇలా విభిన్న జాతులకు చెందిన మామిడి పండ్లు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
మెుజంజాహీ మార్కెట్
హైదరాబాద్‌లోని ఫేమస్ పండ్ల మార్కెట్‌లో మెుజంజాహీ మార్కెట్ ఒకటి. ఇక్కడ కూడా మామిడి పండ్లు అతి తక్కువకే లభిస్తాయి. ఈ మార్కెట్‌లో పండ్లతో పాటు ఐస్‌క్రీమ్స్ ఎంతో ఫేమస్. అలాగే డ్రై ఫ్రూట్స్, పరిమళాలు వెదజల్లే సెంట్ బాటిళ్లు అక్కడ మిమ్మల్ని ఆకర్షిస్తాయి.
మోండా మార్కెట్
సికింద్రాబాద్ దగ్గర ఉన్న మోండా మార్కెట్ కూడా సమ్మర్‌లో మామిడి పండ్లకు చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాల నుంచే గాక దేశం నలుమూల నుంచి ఇక్కడికి వివిధ జాతుల మామిడి పండ్లు వస్తాయి. తోపుడు బండ్లపైన అమ్ముకునేవారు సైతం ఈ మార్కెట్ నుంచే మామిడి కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.
బాటా సింగారం మార్కెట్
హైదరాబాద్‌లోని ప్రముఖ పండ్ల మార్కెట్ల జాబితాలో బాటా సింగారం మార్కెట్ కూడా ముందు వరుసలో ఉంటుంది. ఈ మార్కెట్ నుంచి అధిక మెుత్తంలో మామిడి పండ్లు నగరం నలుమూలలకు వెళ్తుంటాయి. బయట రేట్లతో పోలిస్తే ఇక్కడ మామిడి పండ్ల ధర కేజీకి రూ.20-30 తక్కవకే లభిస్తాయి.
చార్మినార్ ఏరియా
చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనూ మామిడి పండ్లు తక్కువ ధరకే లభిస్తాయి. అక్కడ పండ్ల కోసం ప్రత్యేక మార్కెట్ లేకపోయినప్పటికీ నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ తోపుడు బండ్లపై మ్యాంగోస్ తక్కువ రేటుకే లభిస్తాయి. ఛార్మినార్ వైపు వెళ్లినప్పుడు మామిడి పళ్లను కొనేందుకు ట్రై చేయండి.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్