ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లనుం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈవెంట్‌లో యాపిల్ కంపెనీ విడుదల చేసింది. ఐఫోన్ 15, 15 ఫ్లస్ మోడళ్లను లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 15 మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఫ్లస్ మోడల్ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లభ్యం కానుంది. ఐఫోన్ 15 (128జీబీ) ధర 799 డాలర్లు, ఐఫోన్ 15 ప్లస్ (128జీబీ) ధర 899 డాలర్లుగా నిర్ణయించారు. ఐఫోన్‌లలో ఈసారి A16 బయోనిక్ చిప్, OLED సూపర్ రెటినా డిస్‌ప్లే అమర్చారు. ఈసారి ఐఫోన్లు గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంటాయి.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: