• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL Hat-Trick Wickets: అత్యధిక హాట్రిక్‌ల హీరో మనోడే!

    ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటేనే ఎన్నో రసవత్తర మ్యాచ్‌లకు పెట్టింది పేరు. ఎంతో మంది దేశీయ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి ఈ టోర్నీ తీసుకెళ్లింది. ఐపీఎల్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌ దేనికదే హైలెట్‌ అని చెప్పాలి. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఆటగాడు డకౌట్‌గా వెనుతిరగొచ్చు. అనామక ఆటగాడు సూపర్‌ ఇన్నింగ్స్‌తో హీరోనూ కావొచ్చు. అలాగే ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్లు ఊహించని విధంగా ఔట్‌ అవ్వొచ్చు.. ధారళంగా పరుగులుచ్చే బౌలర్‌ వికెట్లు పడగొట్టొచ్చు. సాధారణంగా టీ20 క్రికెట్‌లో కీలకమైన ఒక వికెట్‌ పడగొడితేనే మ్యాచ్‌ స్వరూపమే మారిపోతుంది. అలాంటింది హ్యాట్రిక్‌ వికెట్లు తీస్తే మ్యాచ్‌ ఫలితం ఏ రేంజ్‌లో చెప్పక్కర్లేదు. అలాంటి హ్యాట్రిక్ వీరులు ఐపీఎల్‌లో ఎంతో మంది ఉన్నారు. 

    ఐపీఎల్‌ ప్రారంభమైన వారం రోజులకే ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో 17వ ఓవర్‌ వేసిన రషీద్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ సీజన్‌ తొలి హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కాగా, ఇప్పటివరకు జరిగిన 14 ఐపీఎల్‌ సీజన్లలో మెుత్తం 20 బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు. అందులో భారత బౌలర్లే 11 మంది ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అమిత్‌ మిశ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున ఆడుతున్న ఈ లెగ్‌ స్పిన్నర్‌ ఐపీఎల్‌లో మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు. ఐపీఎల్‌లో సీజన్ల వారీగా నమోదైన హ్యాట్రిక్‌ వికెట్ల వివరాలను ఇప్పుడు చూద్దాం. 

    ఐపీఎల్‌ 2008

    భారత మాజీ పైసర్‌ లక్ష్మీపతి బాలాజీ ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లోనే తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఆ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున బరిలోకి దిగిన బాలాజీ.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు (3/24) పడగొట్టి చెలరేగాడు. అదే సీజన్‌లో దిల్లీ తరపున బరిలోకి దిగిన అమిత్‌ షా డెక్కన్‌ ఛార్జర్స్‌పై హ్యాట్రిక్‌ తీశాడు. 5/17 గణాంకాలతో చెలరేగాడు. అటు చెన్నై తరపున మఖాయా నిత్ని కూడా హాట్రిక్‌ తీసి ఆకట్టుకున్నాడు. 

    © sachin_rt

    ఐపీఎల్‌ 2009

    2009 ఐపీఎల్‌ సీజన్‌లో కూడా మూడు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. పంజాబ్‌ తరపున ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఒక్కడే రెండు హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టడం విశేషం. ఆర్సీబీ, డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ వరుసగా 3/22, 3/13 గణాంకాలు నమోదు చేశాడు. అటు డెక్కన్‌ ఛార్జర్స్‌ తరపున రోహిత్‌ శర్మ కూడా హ్యాట్రిక్‌ వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

    © mufaddal_vohra

    ఐపీఎల్‌ 2010

    2010 ఐపీఎల్‌లో కేవలం ఒకే ఒక్క హ్యాట్రిక్‌ నమోదైంది. ఆర్సీబీ తరపున పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లకు 18 పరుగులు మాత్రమే ఇచ్చిన ప్రవీణ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. 

    ఐపీఎల్‌ 2011

    2011 సీజన్‌లో అమిత్‌ మిశ్రా ఒక్కడే హ్యాట్రిక్‌ కింగ్‌గా నిలిచాడు. ఆ ఏడాది డెక్కన్‌ ఛార్జస్ తరపున ఆడిన ఈ లెగ్‌ స్పిన్నర్‌ పంజాబ్‌పై 5/17తో చెలరేగాడు. 

    ఐపీఎల్‌ 2012

    ఈ ఏడాది కూడా కేవలం ఒక హ్యాట్రిక్‌ మాత్రమే నమోదు అయింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ అజిత్ చండీలా మూడు వికెట్లు తీశాడు. పూణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/13తో చెలరేగాడు. 

    ఐపీఎల్‌ 2013

    2013 ఐపీఎల్‌ సీజన్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. సన్‌రైజర్స్‌ తరపున పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్‌ వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇదే సీజన్‌ సునీల్‌ నరైన్‌ కూడా కోల్‌కత్తా తరపున హాట్రిక్ సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3/33 గణాంకాలు నమోదు చేశాడు.

    ఐపీఎల్‌ 2014

    ఐపీఎల్‌ 2014 సీజన్‌లో ప్రవీణ్‌ తాంబే, షేన్‌ వాట్సన్‌ ఇద్దరూ హ్యాట్రిక్‌ సాధించారు. కోల్‌కత్తా తరపున ఆడిన తాంబే, వాట్సన్‌ వరుసగా 3/26, 3/13 గణాంకాలు నమోదు చేశారు. 

    © KRxtra

    ఐపీఎల్ 2016

    2015 ఐపీఎల్‌ సీజన్‌లో ఎలాంటి హ్యాట్రిక్ నమోదు కాలేదు. కానీ ఆ తర్వాతి ఏడాదిలో రెండు హ్యాట్రిక్‌లు వచ్చాయి. 2016 సీజన్‌లో పంజాబ్‌ తరపున స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ హాట్రిక్‌ తీశాడు. గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ 4/21తో రాణించాడు. 

    ఐపీఎల్‌ 2017

    2017 సీజన్‌లో ఆర్సీబీ బౌలర్‌ శామ్యూల్‌ బద్రీ అద్భుతంగా రాణించాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హాట్రిక్‌ వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌ శామ్యూల్‌ 4/9 గణాంకాలు నమోదు చేశాడు. అలాగే పంజాబ్ బౌలర్‌ ఆండ్రూ ట్రై, పూణె బౌలర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌లు కూడా వరుసగా మూడేసి వికెట్లు పడగొట్టారు. 

    ఐపీఎల్‌ 2019

    2018 ఐపీఎల్‌ సీజన్‌లో ఎలాంటి హాట్రిక్‌ నమోదు కాలేదు. 2019లో మాత్రం ఇద్దరు బౌలర్లు వరుసగా మూడేసి వికెట్లు తీశారు. పంజాబ్‌ తరపున శామ్‌ కరన్‌ (4/11), రాజస్థాన్ బౌలర్ శ్రేయస్‌ గోపాల్‌ (3/12) రాణించారు. 

    ఐపీఎల్‌ 2021

    2020లో కూడా ఎలాంటి హాట్రిక్‌ రాలేదు. 2021 సీజన్‌లో మాత్రం ఆర్సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌కు ఒక హాట్రిక్‌ దక్కింది. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ 4/17తో చెలరేగాడు. 

    ఐపీఎల్‌ 2022

    గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఒక హాట్రిక్‌ నమోదైంది. రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున యుజువేంద్ర చాహల్ వరుసగా మూడు వికెట్లు తీశాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/40 గణాంకాలు నమోదు చేశాడు. 

    ఐపీఎల్‌ 2023

    ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ జట్టు బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ హాట్రిక్‌ సాధించిన విషయం తెలిసిందే. KKRతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ 3/37తో రాణించాడు. ఈ సీజన్‌లో మరిన్నీ మ్యాచ్‌లు జరగాల్సి ఉండటంతో హట్రిక్‌ బౌలర్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv