దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రం తర్వాత.. జూ. ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. భీమ్ పాత్రలో తారక్ నటన చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ప్రతిష్టాత్మక హిందీ చిత్రం ‘వార్ 2’ (War 2)లో తారక్ నటించే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో జూ.ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన తారక్ ఫొటో ఒకటి.. నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో తారక్ లుక్ పూర్తిగా మారిపోయింది. దీంతో తారక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? అన్న సందేహాలను సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి.
అసలేం జరిగిదంటే?
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ చిత్రం.. 2019లో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘వార్ 2’లో తారక్ నటిస్తుండటంతో ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే వార్ 2 షూటింగ్ కోసం ముంబయి వెళ్లిన తారక్‌తో ఈ బ్యూటీ ఓ సెల్ఫీ దిగింది. వీరిద్దరు జిమ్‌లో ఈ సెల్ఫీ దిగగా.. ఇందులో తారక్ చాలా యంగ్‌గా కనిపించాడు. ఈ ఫొటోలో తారక్ లుక్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తారక్.. ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా చేయించుకున్నాడా? అని కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఊర్వరి ఈ ఫోటోను ఫిల్టర్ చేసి పోస్టు చేసిందని తెలియడంతో అంతా నవ్వుకుని ఊరుకున్నారు. ఫిల్టర్ ద్వారా నీ అందం పెంచుకునేందుకు.. మా తారక్ అన్నను ఇలా మార్చేశావా? అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
తారక్ జోడీగా యానిమల్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Triptii Dimri).. యానిమల్ చిత్రంలో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయింది. రాత్రికి రాత్రే ఈ భామకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారంలో ‘వార్ 2’ కోసం దీప్తి దిమ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే త్రిప్తిని తారక్‌కు జోడీగా తీసుకున్నారా? లేదా హృతిక్ రోషన్‌కి జంటగానా అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైన నేపథ్యంలో త్రిప్తి దిమ్రీ తారక్‌కు జోడీగా నటించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పది రోజులు అక్కడే..
యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తారక్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ ఇండియన్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం తారక్ రెండ్రోజుల క్రితం ముంబయిలో అడుగుపెట్టాడు. పది రోజుల పాటు అతడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటాడు. వార్ 2 కోసం తారక్ 60 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబయిలో తారక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!