• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jr NTR: ఎన్టీఆర్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ చూస్తే మతి పోవాల్సిందే.. రెండేళ్లలో 4 భారీ చిత్రాలు!

    బాక్సాఫీస్‌కు వణుకుపుట్టించే అతికొద్ది మంది హీరోల్లో జూ.ఎన్టీఆర్‌ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అప్పటివరకూ ఉన్న రికార్డ్స్‌ అన్ని సైడ్‌ అవ్వాల్సిందే. ఎన్టీఆర్‌ బిగ్‌ స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోవాల్సిందే. అటువంటి తారక్‌ నుంచి రెండున్నరేళ్లుగా ఒక్క సినిమా కూడా రాలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) తర్వాత ప్రేక్షకులను పలకరించలేదు. దీంతో ఎన్టీఆర్‌ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు తారక్‌ సైతం సెప్టెంబర్‌ 27న ‘దేవర’తో రాబోతున్నాడు. అంతేకాదు నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ పెట్టేందుకు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ చేయబోతున్నాడు. అభిమానుల దాహార్తిని తీర్చేందుకు వచ్చే రెండేళ్లలో ఏకంగా నాలుగు భారీ బడ్జెట్‌ సినిమాలను రిలీజ్‌ చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌ లైనప్‌లోని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. 

    ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌!

    2018 నుంచి 2024 ఆగస్టు మధ్య ఎన్టీఆర్‌ నుంచి కేవలం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మాత్రమే వచ్చింది. అయితే ఆ మూవీ భారీ సక్సెస్‌ గ్యాప్‌ను మర్చిపోయేలా చేసింది. లేటెస్ట్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంతో తారక్‌ రాబోతున్నాడు. ఇక మీదట తారక్‌ నుంచి వరుసగా చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి. వచ్చే రెండేళ్లలో ఏకంగా 4 పాన్‌ ఇండియా చిత్రాలతో తారక్‌ బిగ్‌ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తొలుత దేవరతో సందడి చేయనున్న తారక్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్రం ‘వార్‌ 2‘తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు. అందులో స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నాడు. అలాగే ‘దేవర 2’ సీక్వెల్‌ కూడా తారక్‌ లైనప్‌లో ఉంది. తాజాగా స్టార్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ ప్రారంభమైంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. అలాగే దీంతో పాటు ‘హాయ్‌ నాన్న’ డైరెక్టర్‌ శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్‌ మూవీ ఉండనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తుంది. ఇదీ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా రెండేళ్లలో కనీసం నాలుగు చిత్రాలు రిలీజ్‌ అయ్యేలా ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు కనిపిస్తోంది. 

    ‘NTR 31’ స్టోరీ ఇదేనా!

    ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ శుక్రవారం (ఆగస్టు 9) పూజా కార్యక్రమంతో మెుదలైంది. NTR31 కొత్త పోస్టర్‌ గమనిస్తే ఈ సినిమా చైనా, ఇండియాకు మధ్య సాగే కథాంశం అని ప్రచారం జరుగుతోంది. 1969 నాటి ఓపియం మాఫియాకి రిలేటేడ్‌గా రానున్నట్లు సమాచారం. ఈ మాఫియాలో ఎన్టీఆర్‌ను డ్రగ్ లార్డ్‌గా చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి దగ్గరగా ఉండటంతో ఓపియం స్మగ్లింగ్‌కి అది అడ్డాగా మారింది. దాంతో ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. చైనా డ్రగ్స్‌ మాఫీయా కోల్‌కాత్తాలో యాక్టివ్‌గా ఉండటం అక్కడి లోకల్స్‌ గ్యాంగ్స్‌కి, వీరికి తరచూ గోడవలు జరిగేవట. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ వరకు విస్తరించాయని అంటారు. ఇప్పుడు ఇదే పాయింట్‌తో ప్రశాంత్‌ NTR31 ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

    తారక్‌ ద్విపాత్రాభినయం!

    తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రానున్న ‘NTR 31’ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త ఇటీవల హల్‌చల్‌ చేసింది. ఆ బజ్‌ ప్రకారం ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరిగింది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్‌ కనిపిస్తారని టాక్‌ వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ప్రశాంత్‌ నీల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. 

    ఆ టైటిల్‌ ఖరారు!

    NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్‌నే దాదాపుగా ఖరారు చేసే అవకాశం కూడా ఉందట. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా దానికి ఉంటుందని అంటారు. ఇంత పవర్‌ఫుల్‌ పేరు అయినందువల్లే డ్రాగన్‌ టైటిల్‌ను ప్రశాంత్‌ నీల్‌ పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. పైగా తారక్‌ ఇందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించనున్న నేపథ్యంలో ఈ టైటిల్‌ అయితేనే సరిగ్గా మ్యాచ్‌ అవుతుందని ఆయన భావిస్తున్నారట. టైటిల్‌ ఖరారుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv