కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలుత డైరెక్టర్‌గా సత్తాచాటిన లారెన్స్ ఆ తర్వాత నటుడిగాను తన ప్రతిభ చూపించాడు. ‘మాస్’, ‘స్టైల్’, ‘ముని’, ‘డాన్’, ‘కాంచన’, ‘గంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్‌గా చంద్రముఖి 2 వచ్చిన అతడు బాక్సాఫీస్ వద్ద దారణంగా విఫలయ్యాడు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ‘కాల భైరవ’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
గంభీరమైన లుక్‌లో లారెన్స్!
రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘కాల భైరవ’ (Kala Bhairava). తెలుగులో ‘రాక్షసుడు’ (Rakshasudu), రవితేజతో ‘ఖిలాడి’ (Khiladi) వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన రమేష్ వర్మ ఈ ప్రాజెక్ట్‌కు వర్క్ చేయనుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్‌గా తనదైన ముద్ర వేసిన లారెన్స్ కెరీర్‌లో 25వ చిత్రంగా ఇది రానుంది. ఇవాళ (సెప్టెంబర్ 29) లారెన్స్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్‌గా రానున్న ‘కాల భైరవ’ పోస్టర్ ఇంటెన్స్‌గా ఉంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్!
లారెన్స్ హీరోగా నటించనున్న ‘కాల భైరవ’ చిత్రాన్ని ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి (A STUDIOS LLP), గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఎంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లారెన్స్ కెరీర్‌లో ఇదే హయేస్ట్ బడ్జెట్‌గా రాబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మెుదలు కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
రిస్క్ చేస్తున్నారా?
‘కాల భైరవ’ చిత్రానికి రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారని వార్తలు రావడంపై ఫిల్మ్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో లారెన్స్‌కు మంచి గుర్తింపు ఉన్నప్పటికీ మార్కెట్ పరంగా అతడు వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నాయి. అతడు నటించిన ఏ చిత్రం కూడా ఇప్పటివరకూ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ను నమ్మి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడం నిజంగా రిస్కే అవుతుందని సూచిస్తున్నారు. రిజల్ట్ ఏమాత్రం అనుకూలంగా లేకపోయిన తీవ్ర నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే సబ్జెక్ట్‌పై ఉన్న నమ్మకంతో ఎంతైన ఖర్చు చేసేందుకు మేకర్స్ వెనుకాడటం లేదు.
లారెన్స్ మంచి మనసు
రాఘవ లారెన్స్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలోనే ఓ స్వచ్ఛంద సంస్ధను స్థాపించిన ఆయన దాని ద్వారా పేదలు, రైతులకు పలుమార్లు సాయం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మరోమారు మంచి మనసు చాటుకున్నారు. పేద వితంతు మహిళలకు అండగా నిలుస్తూ కుట్టు మిషన్స్‌ను పంపిణీ చేశారు. వారి కాళ్లపై వారు నిలబడేలా తోడ్పాటు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా లారెన్స్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. తారెన్స్ మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Prabhas: ప్రభాస్ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!