• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Kalki 2 Prediction: ‘కల్కి 2’కి రూ.2000 కోట్లు పక్కా? అసలు కథ ‘పార్ట్ 2’లోనే ఉంది!

  భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలై 2 వారాలు దాటినప్పటికీ కలెక్షన్స్‌లో ఏమాత్రం జోరు తగ్గలేదు. అందరి అంచనాలను అందుకుంటూ కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పురాణాలకు భవిష్యత్‌ను లింక్‌ చేస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఓ డిఫరెంట్‌ వరల్డ్‌కి వెళ్లి వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుత కల్కి జస్ట్‌ ట్రైలర్ అని ప్రచారం జరుగుతోంది. సెకండ్‌ పార్ట్‌ ఎవరు ఊహించని స్థాయిలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కల్కి రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగితే పార్ట్‌ 2 మాత్రం రూ.2000 కోట్లే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపిస్తోంది. 

  అసలు కథ ‘పార్ట్‌ 2’లోనే!

  ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గమనిస్తే తొలి భాగం మెుత్తం పాత్రల పరిచయానికి సరిపోయినట్లు అనిపిస్తుంది. భైరవగా ప్రభాస్‌ (Prabhas), సుమతిగా దీపికా పదుకొనే (Deepika Padukone), అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌గా కమల్‌ హాసన్‌ (Kamal Hassan), అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) పాత్రల చుట్టే కల్కి తిరిగింది. ఒక్కో పాత్ర నేపథ్యం, కథలో వారి ప్రాధాన్యతలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తొలి భాగంలో చూపించాడు. కలియుగం అంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు, విలన్‌ సుప్రీమ్‌ యాష్కిన్‌ వారిని పెడుతున్న బాధలు కళ్లకు కట్టాడు. మహా విష్ణువు పదో అవతారమైన ‘కల్కి’ రాకకు ముందు ఉన్న పరిస్థితులను ‘పార్ట్‌ 1’లో చూపించారు. అయితే హీరో ప్రభాస్‌, విలన్‌ సుప్రీమ్ యాష్కిన్‌ ఒక్కసారి కూడా తొలి భాగంలో ఎదురెదురు పడలేదు. అయితే ‘పార్ట్‌ 2’లో వీరిద్దరు ఒకరితో ఒకరు నేరుగా తలపడవచ్చు. ఇది సెకండ్‌ పార్ట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనుంది. 

  కమల్‌ హాసన్‌ విశ్వరూపం

  కల్కి సినిమాలో కమల్‌ హాసన్‌ పాత్ర నిడివి 15 నిమిషాల కంటే తక్కువే. రెండు మూడు డైలాగ్స్ మినహా ఆయన నటనను వీక్షించే అవకాశం ఆడియన్స్‌కు లభించలేదు. సుమతి (దీపిక పదుకొనే) గర్భం నుంచి సేకరించిన సీరాన్ని ఇంజెక్ట్‌ చేసుకొని సుప్రీమ్‌ యాష్కిన్‌ దైవ శక్తి పొందుతాడు. అతడు మరింత శక్తివంతంగా మారడాన్ని ‘కల్కి’ క్లైమాక్స్‌లో చూపించారు. దీంతో ‘కల్కి 2’లో కమల్‌ హాసన్‌ పాత్ర పూర్తి స్థాయిలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ కమల్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘కల్కి 2’ తాను ఎక్కువ సేపు కనిపిస్తానని చెప్పుకొచ్చారు. ఫలితంగా భైరవ నుంచి కర్ణుడిగా మారిన ప్రభాస్‌, అశ్వత్థామ అమితాబ్‌తో సుప్రీమ్‌ యాష్కిన్‌ నేరుగా తలపడే అవకాశముంది. ఈ క్రమంలో నటన పరంగా కమల్‌ హాసన్‌ విశ్వరూపం చూసే ఛాన్స్‌ ఫ్యాన్స్‌కు లభించవచ్చు.

  భైరవ తన శక్తి ఎలా తెలుసుకుంటాడు?

  భైరవగా ఉన్న ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలో ఉపయోగించిన ఆయుధం భైరవ చేతిలో పడటం, దాని నుంచి శక్తి విడుదలై కర్ణుడుగా మారిపోవడం చూపించారు. యాష్కిన్‌ మనుషులను చంపిన తర్వాత మళ్లీ భైరవగా మారతాడు. కల్కిని గర్భంలో మోస్తున్న దీపికను భైరవ ఎత్తుకెళ్లడంతో తొలి భాగం ముగుస్తుంది. మరి సెకండ్ పార్ట్‌లో తాను కర్ణుడు అని ప్రభాస్‌ ఎలా గ్రహిస్తాడు? బౌంటీ (డబ్బు) కోసం దీపికను తీసుకెళ్లిన భైరవ ఆమెను ఏం చేశాడు? సోదరుడైన అశ్వత్థామకు ఎలా దగ్గరవుతాడు? కల్కి రాకను అడ్డుకుంటున్నవిలన్‌ యాష్కిన్‌తో ఎలా తలపడతాడు? అన్నది సెకండ్‌ పార్ట్‌లో రానుంది. 

  విజయ్‌కి ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌!

  కల్కిలో అర్జునుడు పాత్రలో కనిపించి విజయ్‌ దేవరకొండ అందరినీ ఆశ్చర్యపరిచాడు. మహాభారతంలోని కురుక్షేత్రం ఎపిసోడ్‌లో అతడు మెప్పించాడు. అయితే విజయ్‌ది కేవలం క్యామియో మాత్రమే కాదని తెలుస్తోంది. రెండో పార్ట్‌లో ఆయన ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ పోషించనున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. మరి అర్జునుడు పాత్రను ఫ్యూచర్‌లోకి తీసుకొస్తారా? లేదా కురుక్షేత్రానికి సంబంధించి మరిన్ని సన్నివేశాలు చూపించి అందులో విజయ్‌ కనిపించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర కూడా సెకండ్‌ పార్ట్‌లో తిరిగొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ‘కల్కి 2’ ఈజీగా రూ.2000 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

  కల్కి పాత్రలో ఎవరు?

  పురాణాల ప్రకారం కలిని మహా విష్ణువు అవతారమైన కల్కి అంతం చేస్తాడు. కల్కి షూటింగ్‌ మెుదలైనప్పటి నుంచి కల్కి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే అతడ్ని కర్ణుడుగా చూపించి డైరెక్టర్‌ ఝలక్‌ ఇచ్చాడు. దీంతో సినిమాకు మూలమైన కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే తొలి భాగం పూర్తయ్యే వరకూ కల్కి సుమతి గర్భంలోనే ఉన్నాడు. కాబట్టి సెకండ్‌ పార్ట్‌లో ఒక్కసారిగా పెరిగి పెద్దవాడైనట్లు చూపించే అవకాశం లేదు. కాబట్టి కల్కిని ఓ బాలుడిగా చూపించే ఛాన్స్‌ ఉంది. కలి అయిన సుప్రీమ్‌ యష్కిన్‌ను ఆ బాలుడు చంపేందుకు ప్రభాస్‌ (కర్ణుడు/భైరవ), అశ్వత్థామ (అమితాబ్‌ బచ్చన్‌) సాయం చేయవచ్చు. 

  ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడంటే?

  ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు. ‘కల్కి పార్ట్-2’ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్​ను రివీల్ చేశారు.  అంతేకాకుండా 2025 సమ్మర్​ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘త్వరగా అఫీషియల్ అప్డేట్​ ఇవ్వండి’, ‘పార్ట్ 2 కోసం వెయిటింగ్​’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv