రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఎ.డి (Kalki 2898 AD). బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ ప్రచార గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మూవీలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పురణాల్లో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకునేందు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
అశ్వత్థామ ఎవరంటే?
‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలిసినప్పటీ నుంచి ఆయన పోషిస్తున్న పాత్రపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పురణాల్లోని ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని లీక్స్ కూడా వచ్చాయి. అందుకు తగ్గట్లే ఆయన ‘అశ్వత్థామ’ పాత్రలో నటించనునట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పాత్రపై బజ్ ఏర్పడింది. పురణాల ప్రకారం.. మహాభారతంలో అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేత అశ్వత్థామ శపించబడతాడు. ప్రపంచం అంతమయ్యే వరకు అశ్వత్థామ.. తనకి ఉన్న గాయాలతో రక్తం, చీము కారుతూ, నిత్యం రగులుతూ బ్రతికే ఉండాలని శపిస్తాడు. ఈ శాపంతో అశ్వత్థామ ఇప్పటికి బ్రతికే ఉన్నాడని, గాయాలు నుంచి శ్రవించే రక్తం కనిపించకుండా ఒంటి నిండా బట్ట చుట్టుకొని ఉంటాడని సనాతన ధర్మ గురువులు చెబుతుంటారు. తాజాగా విడుదలైన అమితాబ్ లుక్స్ అచ్చం అలాగే ఉండటం గమనార్హం.
గ్లింప్స్‌లో ఏముంది?
కల్కిలో అశ్వత్థామను పరిచయం చేస్తూ ఆదివారం ఓ ఆసక్తికర వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ‘నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? నువ్వు ఎవరు?’ అంటూ ఓ చిన్నారి అమితాబ్‌ను ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్ తన పాత్రను పరిచయం చేస్తాడు. ‘అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. నేను గురు ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ’ అని బాలుడితో చెప్పి బిగ్ బి అదృశ్యం అవుతాడు. కాగా, ఈ గ్లింప్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని పేర్కొంటున్నారు. కాగా, అమితాబ్ గ్లింప్స్‌కు సంతోష్ నారాయణన్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాలా బాగుంది.
రాజమౌళిని ఫాలో అవుతున్న నాగ్!
అశ్వత్థామ పాత్ర తరహాలోనే రానున్న రోజుల్లో ‘కల్కి 2898 ఏడీ’లోని ఇతర కీలక రోల్స్‌కు సంబంధించిన పరిచయ వీడియోలు కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా సమయంలో దర్శకధీరుడు రాజమౌళి అనుసరించిన ఫార్మూలనే కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుసరించబోతున్నట్లు సమాచారం. బాహుబలి సమయంలో ప్రభాస్, రానా (భల్లాలదేవ), అనుష్క (దేవసేన) పాత్రలను రాజమౌళి ఓ ప్రత్యేక గ్లింప్స్ రూపంలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ తరహాలోనే నాగ్ అశ్విన్ కూడా అమితాబ్ బచ్చన్ రోల్‌ను పరిచయం చేశారు. త్వరలోనే ప్రభాస్ ‘భైరవ’ టీజర్ కూడా వస్తుందట. అలాగే దీపికా పదుకొనే, కమల్‌హాసన్ తదితరుల పాత్రలను కూడా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దీపికా, కమల్ పాత్రలు అవేనా?
‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్ హాసన్ (Kamal Haasan) చేస్తున్న రోల్స్ అవేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరి పాత్రలకు సంబంధించి కూడా వీడియో రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటి ఇవ్వాల్సి ఉంది.
నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!
‘కల్కి 2898 ఏడీ’ విడుదల తేదీకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. వాస్తవానికి మే 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ రోజున ఈ సినిమా విడుదల కావడం లేదు. ఈ క్రమంలోనే కొత్త తేదీని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ పాత్రను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడంతో ‘అశ్వత్థామ వీడియో గ్లింప్స్’లోనే విడుదల తేదీని రివీల్ చేస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. అయితే ఎలాంటి డేట్‌ను లాక్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!