• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Update: కల్కిలో దిశా పటానీ పాత్రపై క్రేజీ బజ్‌.. పురాణాలకు ముడిపెడుతున్న నెటిజన్లు!

    ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’.. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను సైతం చిత్ర యూనిట్‌ ప్రారంభించింది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్, ప్రభాస్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఫ్యాన్స్‌ అలరించాయి. తాజాగా బుజ్జి అనే రోబోటిక్‌ వెహికల్‌ పాత్రను కూడా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఆడియన్స్‌ పరిచయం చేశారు. అయితే ఈ సినిమా పురణాలను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నట్లు దర్శకుడు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి దిశా పటాని నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించి క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    మోహినిగా దిశా పటానీ!

    లేటెస్ట్ బజ్‌ ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో దిశా పటానీ (Disha Patani) మోహినీ అనే యువతి పాత్రలో చేయబోతున్నట్లు తెలుస్తోంది. విలన్‌ అయిన కమల్‌ హాసన్‌.. ఆమెను గూఢచారి (స్పై)గా భైరవ (ప్రభాస్‌) వద్దకు పంపిస్తాడని సమాచారం. మోహిని తన గ్లామర్‌తో ప్రభాస్‌ను ఆకట్టుకొని అతడు నుంచి రహాస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఈ మూవీలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరోవైపు కొందరు నెటిజన్లు.. దిశా పటానీ పాత్రను ఇతిహాసాలలోని మోహిని పాత్రతో లింకప్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. 

    ఆ లాజిక్‌ మాటేంటి?

    ఇతి హాసాలలోని మోహిని పాత్రతో దిశాపటాని పాత్రను పోల్చడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో అసలు లాజిక్‌ లేదని అంటున్నారు. పురాణాల ప్రకారం మోహిని పాత్ర అనేది మహా విష్ణువు అవతారం. ఇందులో ప్రభాస్‌ కూడా మహా విష్ణువు అవతారం (భైరవ)లో కనిపిస్తాడని టాక్‌ ఉంది. కాబట్టి మోహిని పాత్ర.. ప్రభాస్‌పై ఎలా స్పై చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ లేటెస్ట్‌ బజ్‌లో నిజం లేకపోవచ్చని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే దిశాపటానీ పాత్ర పేరు వరకే మోహిని ఉండి, పురణాలతో ఆమెకు సంబంధం లేకపోతే తాజా ప్రచారంపై నమ్మకం ఉంచొచ్చని ఇంకొందరు పోస్టులు చేస్తున్నారు. దీనిపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇస్తే తప్ప ఈ చర్చ ముగిసేలా లేదు.

     

    దిశాతో ప్రభాస్ స్పెషల్‌ సాంగ్‌

    ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రభాస్‌కు జోడీగా చేస్తోంది. ఇక సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. ప్రభాస్‌ – దిశా పటానీ మధ్య ‘కల్కి’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉండనుంది. ఈ పాటకు సంబంధించిన షూట్‌ను నెల రోజుల క్రితం ఇటలీలో నిర్వహించారు. ఇటలీలోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అప్పట్లో దిశా పటానీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ ఫొటోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. 

    దీపికా, కమల్‌ పాత్రలు అవేనా? 

    ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే (Deepika Padukone), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) చేస్తున్న రోల్స్‌పై కూడా సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఇందులో దీపికా.. ‘కౌముది’ పాత్రలో కనిపించనున్నట్లు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కమల్‌ హాసన్‌.. ‘కాళీ’ పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. వీరి పాత్రలు కూడా కల్కిలో చాలా కీలకంగా ఉంటాయని.. ముఖ్యంగా ప్రభాస్‌ను ఢీకొట్టే పాత్రలో కమల్‌ హాసన్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి పాత్రలపైనా స్పష్టత రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv