• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Katha Venuka Katha Review: ఓటీటీల్లో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. అంతలా ఏముందంటే?

    ఆసక్తికరమైన కథ, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేటువంటి కథనం ఉంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించింది “కథ వెనుక కథ”(Katha Venuka Katha Review) సినిమా. సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా.. వచ్చిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య  తెరకెక్కించాడు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో.. ఓసారి సమీక్షిద్దాం.

    నటీనటులు

    విశ్వంత్, శ్రీజిత గౌస్, శుభశ్రీ, ఆలీ, ఛత్రపతి శేఖర్, సునీల్, జయప్రకాశ్, రఘుబాబు, బెనర్జీ, సత్యం రాజేష్, మధునందన్, ఖయ్యుం, భూపాల్, రూప, డైరెక్టర్: కృష్ణ చైతన్య, నిర్మాత- అవనీంద్ర కుమార్.

    కథ

    సినిమా డైరెక్టర్ కావాలనుకున్న ఓ యువకుడి కథ ఇది. అశ్విన్ తన మరదలు శైలజను ప్రేమిస్తుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతని మేనమామతో చెబుతాడు. జీవితంలో ఏదైనా సాధించి రా.. అప్పుడు పెళ్లి చేస్తానని అతని మేనమామ చెబుతాడు. దీంతో ఓ నిర్మాత సాయంతో తాను అనుకున్న సినిమాను తీస్తాడు. తీసిన సినిమాలోని నటీనటులంతా విడుదలకు ముందు ఒక్కొక్కరు మిస్ అవుతారు. అందులో ఒక యాక్టర్ మరణిస్తాడు. కేసు విచారణలో సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకు నటీనటులు ఎలా మిస్ అయ్యారు. విచారణలో తేలిన సంచలన విషయాలు ఏమిటి అనేది మిగతా కథ

    సినిమా ఎలా ఉందంటే?

    ఫస్టాప్‌లో తొలి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినప్పటికీ.. చాలావరకు మూవీ ఎంగేజ్‌డ్‌గా ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో వేగం పెరుగుతుంది. నేరం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్‌ రివీల్ అవుతూ ముందుకు సాగుతుంది.  మొదటి భాగంలో ప్రేక్షకుల మదిలో ఉదయించిన ప్రశ్నలకు రెండో భాగం ప్రీ క్లైమాక్స్‌లో డైరెక్టర్ సమాధానాలు ఇస్తాడు. ఈక్రమంలో  ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి. సస్పెన్స్ హోల్డ్ చేస్తూ స్క్రీన్‌ప్లేను దర్శకుడు నడిపిన తీరు బాగుంది.

    ఎవరెలా చేశారంటే?

     హీరోగా నటించి అశ్విన్ డైరెక్టర్ కావాలనే ఆకాంక్షను ఎప్పటికప్పుడు బయటపెడుతూ బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తుంటుంది. కమెడియన్‌గా సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా (Katha Venuka Katha Review) మంచి అవుట్‌ఫుట్‌తో ఉంటుంది.  వైవిధ్యమైన పాత్రలో  కనిపించి సునీల్ ఆ పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్‌గా నటించిన శ్రీజిత ఘోష్ పర్వాలేదనిపించింది.  సత్యం రాజేష్ తనదైన కామెడీని పండించాడు. సీనియర్ నటుడు జయప్రకాశ్ సినీ నిర్మాతగా, కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి ఆయా పాత్రాలకు న్యాయం చేశారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్న యువ డైరెక్టర్‌ కృష్ణ చైతన్య.. ఎక్కడా ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కథనంపై ఎంగేజ్ చేశాడు. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్త స్లోగా నడిచినప్పటికీ.. కథలో మేయిన్ పాయింట్ ఎలివేట్ అయ్యాక ఎక్కడా బొర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో సస్పెన్స్‌ క్యారీ చేసి సెకండాఫ్‌లో ఆఖరి 30 నిమిషాల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది. 

    టెక్నికల్‌గా

    సినిమా టెక్నికల్‌ పరంగా, నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. మ్యూజిక్, BGM పర్వాలేదనిపిస్తుంది. శేఖర్ గంగనమోని సినిమాటోగ్రఫీ ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. అమర్ రెడ్డి ఇంకాస్తా ఎడిటింగ్‌ పనిచెబితే బాగుండేది.

    బలాలు

    కథనం

    ప్రీ క్రైమాక్స్

    డైరెక్షన్

    బలహీనతలు

    తొలి 20 నిమిషాలు

    బలవంతంగా జొప్పించిన ఐటెం సాంగ్

    Telugu.yousay.tv Rating: 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv