టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు(Kiran Abbavaram) ముఖ్య అతిథిగా అక్కినేని నాగచైతన్య కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం చేసిన భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ చర్చ “క” సినిమా గురించి కాదు. ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై కిరణ్ అబ్బవరం తన మనసులోని బాధను బయటపెట్టాడు.
ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం పలు ట్రోల్స్‌కి గురయ్యాడు. వీటిపై ఆయన ఎక్కువగా స్పందించకుండా తన పని తాను చూసుకుంటూ(Kiran Abbavaram Trolling Movie) వెళ్లిపోయేవాడు. ఈసారి మాత్రం ఆ ట్రోల్స్ మితిమీరుతున్నాయని భావించి గట్టిగా స్పందించాడు. ఈ ప్రసంగంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అతని వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ సందర్భంలో కిరణ్ అబ్బవరం, ఒక సినిమాలో తన అనుమతి లేకుండా తనపై ట్రోల్ సన్నివేశాన్ని ఉపయోగించారని చెప్పుకొచ్చారు.
” ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను. ఏదో నా పని చేసుకుంటూ వెళ్తున్నాను. సంవత్సరానికి రెండు సినిమాలు. మూడు సినిమాలు చేస్తూన్నాని పక్కనపెడితే.. నా మీద కొంత మంది సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీదా..! ఏమన్న సంబంధమా? నా మీద ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది సినిమాలో.. కొంచెం రిక్వెస్టింగ్‌గానే అడుగుతున్నా.. ఎందుకన్న నామీదా.. నా పనేదో నేను చేసుకుంటున్నాను. ఏరోజైనా మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఏంటి? ఓ సినిమాలో డైరెక్ట్‌గా నా మీదా ట్రోలింగ్ కనీసం నాకు ఇన్పర్మేషన్ లేదు. బ్రో, కిరణ్ బ్రో మీ గురించి ఒకటి సినిమాలో వేస్తున్నాం. ఎక్కడో నా ఫ్యాన్స్ నాకు చూపించి ఏంటి బ్రో నీ గురించి ఈ సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే.. నేను రిక్వెస్టింగ్‌గా అడుగుతున్నా? మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ చేసేంత ఏం చేశాను నేను అని అంటూ” భావోద్వేగానికి లోనయ్యాడు.
కిరణ్ అబ్బవరం ప్రసంగం తర్వాత ఇంతకు ఆ సినిమా ఏమై ఉంటుందని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
అయితే కిరణ్ ప్రస్తావించిన సన్నివేశం గత ఏడాది వచ్చిన కన్నడ డబ్బింగ్ సినిమా ‘హాస్టల్ స్టూడెంట్స్’లోని సన్నివేశం. ఈ చిత్రాన్ని ‘చాయ్ బిస్కెట్’ నిర్మాణ సంస్థ తెలుగులోకి డబ్బింగ్ చేసింది. ఆ సినిమా స్టార్టింగ్ సీన్ లో ఇద్దరు(Kiran Abbavaram Trolling Movie) స్టూడెంట్స్ కిరణ్ అబ్బవరం నటించిన ఓ సినిమా ట్రైలర్ గురించి చర్చిస్తూ ఒకరు కిరణ్ అబ్బవరం ట్రైలర్ వచ్చింది అంటాడు. ఇంకొకరు ఏంటీ “మళ్లీ వచ్చిందా?” అంటూ వెటకారంగా మాట్లాడతారు. అప్పట్లో కిరణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఉండటంతో, ఆ సినిమాకు సంబంధించి అతని మీద సెటైర్ వేసినట్లు అనిపించింది. దీనిపై కిరణ్ ఈ ఈవెంట్ లో తన బాధను వ్యక్తం చేశాడు. కానీ, అతను ఎక్కడా కూడా ఆ సినిమా పేరు లేదా మేకర్స్ పేర్లు ప్రస్తావించలేదు. కానీ, తన మనసుకు బాధ కలిగిన విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పాడు.
కిరణ్ స్పీచ్‌కి సోషల్ మీడియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాటి పాటలేని బేవర్స్ కొంత మంది ట్రోల్ చేసినంత మాత్రనా మీకు ఏం కాదు బ్రో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. నువ్ పట్టించుకోకు కిరణ్ అన్నా అంటూ మరో నెటిజన్ ఓదార్చే ప్రయత్నం చేశాడు.
ఇక ‘క’ సినిమా దీపావళి రోజు(అక్టోబర్ 31)న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మితమైంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల ద్వయం డైరెక్ట్ చేసింది.