ఐదు శతాబ్దాల హిందువుల నిరీక్షణను నిర్వీర్యం చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం (Ayodhya Rama Mandir) కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Bala Rama Prana Pratishta) కనుల పండువగా జరిగింది. ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా, టీవీల్లో వీక్షించిన కోట్లాది భక్తజనం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. జైరామ్ (Jai Shree Ram) నినాదాలతో యావత్ దేశం మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో రామాయాణాన్ని (Ramayanam) ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తెలుగు సినిమాలు, వాటిలో నటించిన ప్రముఖ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం.
ఆదిపురుష్
రామాయణాన్ని కథాంశంగా చేసుకొని ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’ (Aadipurush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) రూపొందించిన మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాముడి పాత్ర పోషించారు. సీతగా బాలీవుడ్ నటి కృతి శెట్టి కనిపించింది. ఆదిపురుష్‌లోని ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్’ పాట ఆయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్బంగా దేశవ్యాప్తంగా మార్మోగడం విశేషం.
శ్రీరామ రాజ్యం
బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతా దేవిగా నటించిన చిత్రం ‘శ్రీరామ రాజ్యం’ (Sri Rama Rajyam). శ్రీరాముడి సంతానం లవకుశల కథను ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. దిగ్గజ దర్శకుడు బాపు ఈ సినిమాను రూపొందించగా.. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ప్రతీ శ్రీరామ నవమి రోజున ప్రముఖంగా వినిపిస్తాయి.
శ్రీ రామదాసు
శ్రీరాముడికి పరమభక్తుడైన కంచర్ల గోపన్న(Kancharla Gopanna) జీవిత కథ ఆధారంగా ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున (Nagarjuna) లీడ్‌రోల్‌లో నటించారు. గోపన్న భద్రాచలంలో రాములవారికి గుడి కట్టించి ఎలా శ్రీరామదాసుగా మారాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. రాఘవేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ రాముడిగా, అక్కినేని నాగేశ్వరరావు కబీర్‌దాస్‌గా నటించారు.
దేవుళ్లు
తెలుగులో వచ్చిన దేవుళ్లు (Devullu) చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హిందువులు పూజించే ప్రముఖ దేవుళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా రూపొందింది. ఇందులో రాముడిగా శ్రీకాంత్, ఆంజనేయుడిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. ఇద్దరు చిన్నారుల తమ తల్లిదండ్రుల మెుక్కులను తీర్చేందుకు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఎలా దర్శించుకున్నారు. వారికి దేవుళ్లు ఏవిధంగా సాయపడ్డారు అన్నది ఈ సినిమా. దేవుళ్లు చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
బాల రామాయణం
చిన్నారులనే పాత్రదారులుగా చేసుకొని నిర్మించిన చిత్రం ‘బాల రామాయణం’ (Bala Ramayanam). గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రామునిగా నటించారు. బాలనటి స్మిత.. సీత పాత్రను పోషించింది. ఈ చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక చేయబడింది.
శ్రీ సీతారామ జననం
1944లో విడుదలైన ‘శ్రీ సీతా రామజననం’ (Sita Rama Jananam) చిత్రం అప్పట్లో అపూర్వ విజయాన్ని అందుకుంది. అక్కినేని రాముడిగా, నటి త్రిపుర సుందరి సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారానే ఘంటసాల గాయకుడిగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలో కోరస్ కూడా ఇచ్చారు.
సీతారామ కళ్యాణం
నందమూరి తారకరామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Sita Rama Kalyanam Movie)లో హరినాథ్, గీతాంజలి సీతారాములుగా నటించారు. ఎన్.టీ రామారావు రావణాసురిడిగా కనిపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇందులో నారద పాత్రను కాంతారావు పోషించడం విశేషం.
సంపూర్ణ రామాయణం
టాలీవుడ్‌లో వచ్చిన శ్రీరాముని చిత్రాల్లో ‘సంపూర్ణ రామాయణం’ (Sampoorna Ramayanam) ఒకటి. ఈ చిత్రం కూడా అప్పట్లో విశేష ప్రజాధరణను పొందింది. శోభన్‌బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించారు. ఎస్వీ రంగారావు రావణుడి పాత్రను పోషించడం విశేషం. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.
లవకుశ
నందమూరి తారకరామారావు చేసిన గుర్తిండిపోయే చిత్రాల్లో ‘లవకుశ’ (LavaKusa) కచ్చితంగా ఉంటుంది. రామాయణం ఉత్తరకాండం ఈ సినిమా కథాంశానికి మూలం. ఈ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ నటించగా సీత పాత్రను అంజలీ దేవి పోషించింది. లవ, కుశలుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి. శ్రీరామ నవమి సందర్భంగా పందిర్లలో ఈ చిత్ర పాటలు ప్రముఖంగా వినిపిస్తుంటాయి.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్