• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’…కానీ ఒక్కటి మిస్ అయ్యింది!

    నటీనటులు: సుమంత్‌ ప్రభాస్‌, సిరి రాశి, మురళిధర్‌ గౌడ్‌, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి, 

    డైరెక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌

    సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌

    సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దూపాటి

    నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సూర్య చౌదరి

    ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్‌ అయిన ‘మేమ్‌ ఫేమస్‌’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. 

    కథ

    తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్‌ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. 

    అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. 

    ఎలా సాగిందంటే..

    ముగ్గ‌రు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫ‌స్టాఫ్ అంతా రిపీట్‌ మోడ్‌లో క‌నిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్‌ హౌజ్‌ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్‌ ఇష్యూస్‌, టెంట్‌హౌజ్‌ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్‌ అంతా యూట్యూబ్‌ వీడియోస్‌ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి.  అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు. 

    ఎవరెలా చేశారంటే?

    నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.  నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మ‌ణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, కిర‌ణ్ మ‌చ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివ‌నంద‌న్ కామెడీ బాగుంది.  అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    మేమ్‌ ఫేమస్‌ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్‌ ప్రభాస్‌ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది.  సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బ‌లం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్‌ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది. 

    టెక్నికల్‌గా

    సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఎందుకని భావించినట్లు అనిపించింది.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కామెడీ
    • నేపథ్య సంగీతం
    • ఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ స్టోరీ
    • సాగదీత
    • పాటలు

    రేటింగ్‌: 2.75/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv