• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Nag Ashwin: అర్జునుడు vs కర్ణుడులో ఎవరు గొప్పా? ‘కల్కి’ డైరెక్టర్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌..!

  భారీ అంచనాలతో విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అశ్విన్‌ (Nag Ashwin) రూపొందించిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాణాలకు ఫ్యూచరిక్‌ అంశాలను ముడిపెడుతూ తీర్చిదిద్దిన ‘కల్కి’పై సర్వత్రా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అయితే కొందరు మాత్రం.. నెట్టింట ‘కల్కి’ సినిమాను తప్పుబడుతున్నారు. పురణాలను నాగ్‌ అశ్విన్‌ వక్రీకరించారని పోస్టులు పెడుతున్నారు. కౌరవుల పక్షాన ఉన్న కర్ణుడ్ని.. అర్జునుడి కంటే బలవంతుడిగా చూపించడాన్ని తీసుకోలేకపోతున్నారు. కాగా, దీనిపై నాగ్‌ అశ్విన్‌ తనదైన శైలిలో స్పందించారు. 

  కల్కిపై నెటిజన్ల ప్రశ్నలు!

  ‘కల్కి 2898 ఏడీ’ క్లైమాక్స్‌లో కర్ణుడు పాత్రను హైలెట్‌ చేయడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. కర్ణుడు మరలా తిరిగొచ్చినట్లు చూపించడం పురాణాలను వక్రీకరించినట్లేనని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన తిరిగొచ్చినట్లు చూపించడంలో లాజిక్ ఉందని అంటున్నారు. కల్కి అవతార సమయంలో అశ్వత్థామ భగవంతుండికి అండగా ఉంటాడని పురణాలు సైతం చెప్పాయని పేర్కొంటున్నారు. మరి కర్ణుడు కూడా ఫ్యూచర్‌లో మళ్లీ తిరిగొస్తాడని పురణాల్లో ఎక్కడ చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. అంతా ఓకే గానీ కర్ణుడు విషయంలో మాత్రం దర్శకుడు తన లెక్కతప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు పాత్రను తగ్గిస్తూ.. కౌరవుల పక్షాన నిలిచిన కర్ణుడుని హైలెట్‌ చేయడం బాగోలేదని అంటున్నారు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు గొప్ప అయితే అర్జునుడు గొప్ప కాదా? అని ప్రశ్నిస్తున్నారు. 

  ‘కర్ణుడుని అందుకే హైలెట్‌ చేశా’

  కల్కి సినిమాలో కర్ణుడు పాత్రపై వస్తున్న ప్రశ్నలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తాజాగా స్పందించారు. కర్ణుడుని ఎందుకు అంత గొప్పగా చూపించారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘మహాభారతంలో ఉన్న కర్ణుడిని ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని స్వభావాన్ని మెచ్చుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అతని క్యారెక్టర్‌ని హైలైట్ చేశా’ అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ఈ మాటలతో కొందరు నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. పురణాలు సైతం కర్ణుడుని ధీశాలిగా కీర్తించాయని గుర్తు చేస్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవని, నాగ్‌ అశ్విన్‌ చూపించిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు. 

  కర్ణుడు vs అర్జునుడు ఎవరు గొప్పా?

  మరి అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? అన్న ప్రశ్నను రిపోర్టర్లు నాగ్ అశ్విన్ ముందు ఉంచారు. దీనిపై నాగ్‌ అశ్విన్‌ మరో వివరణ ఇచ్చారు. ‘ వారిద్దరిలో (అర్జునుడు, కర్ణుడు) ఎవరు గొప్ప అనే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మహాభారతం మీద చర్చ జరుగుతుంది కదా.. అది మంచి విషయమే కదా.. అందరూ దీని గురించి తెలుసుకుంటారు కదా’ అని అసంపూర్ణ సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్‌ను కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే.. ధర్మం వైపు నిలిచిన అర్జునుడే గొప్ప అని చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇది సినిమా చూసే ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టడమేనని మండిపడుతున్నారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంటున్నారు. 

  ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడంటే?

  ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు. ‘కల్కి పార్ట్-2’ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్​ను రివీల్ చేశారు.  అంతేకాకుండా 2025 సమ్మర్​ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘త్వరగా అఫీషియల్ అప్డేట్​ ఇవ్వండి’, ‘పార్ట్ 2 కోసం వెయిటింగ్​’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv