బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒకరు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీ దేవి కూతురిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో తొలిసారి ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి ఓకే చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న జాన్వీ లేటెస్ట్‌గా మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నానితో జాన్వీ జతకట్టబోతున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
‘Nani 33’ ప్రాజెక్ట్‌పై సంతకం!
నేచురల్ స్టార్ నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన ‘దసరా’ (Dasara) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం ద్వారా నాని, శ్రీకాంత్ ఓదెల తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే శ్రీకాంత్ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశారు. అయితే వీరి కాంబోలోనే మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ రాబోతోంది. ‘Nani 33’ ప్రొడక్షన్ టైటిల్‌తో ఇది రూపొందనుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ను ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘Nani 33’ ప్రాజెక్టుపై జాన్వీ సంతకం కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విన్న నాని అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. వీరిద్దరి జోడీ కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని పోస్టులు పెడుతున్నారు.
త్వరలోనే షూటింగ్!
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో ‘Nani 33’ ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. మరోవైపు ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీకాంత్ భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ఫైనల్ కాగా ఇది నాని కూడా బాగా నచ్చినట్లు సమాచారం. ఈ మూవీలో నటించేందుకు హీరో నాని చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు తెలుస్ోతంది. ‘సరిపోదా శనివారం’ అయిపోగానే ఈ సినిమా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
ఫుల్ స్వింగ్‌లో జాన్వీ కపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు లక్ ఓ రేంజ్‌లో ఉంది. తెలుగులో ఇప్పటివరకూ ఒక్క సినిమా రిలీజ్ కానప్పటికీ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఈ అమ్మడును వరిస్తోంది. తెలుగులో మెుట్ట మెుదటి చిత్రమే తారక్ (Jr NTR) పక్కన చేసే అవకాశం జాన్వీకి లభించింది. ఎన్టీఆర్‌కు జోడీగా ‘దేవర’ (Devara) నటిస్తుండగానే రామ్‌చరణ్ (Ram Charan) పక్కన ‘RC16’ ప్రాజెక్ట్‌కు ఎంపికై జాన్వీ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పుడు నాని సినిమాలోనూ చోటు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా జాన్వీ మారిపోయిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ భామకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నాయి.
ఆగస్టు 29న విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) ఈ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) నటిస్తోంది. ఆగస్టు 29న (Saripodhaa Sanivaaram Release Date) వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదలవుతుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్