ప్రస్తుత ఓటీటీ యుగంలో.. వందలాది చిత్రాలు ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, ఫాంటసీ ఇలా ఏ జానర్ సినిమా అయిన ఒక్క క్లిక్‌తో చూసేయచ్చు. అయితే ఫీల్‌గుడ్ సినిమాలు ఇచ్చే సంతృప్తి, ఆనందాన్ని మరే జానర్ ఇవ్వలేదని చాలా మంది అంటుంటారు. ఆయా చిత్రాల్లోని భావోద్వేగాలు గుండెను ఎంతగానో బరువెక్కిస్తాయని చెబుతుంటారు. మీకు సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని పంచే అద్భుతమైన ఫీల్‌గుడ్ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. IMDBలో 8.3 రేటింగ్‌ను సైతం ఆ సినిమా కలిగి ఉంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎక్కడ స్ట్రీమ్ అవుతోంది? ఆ సినిమా ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ సినిమా ఏదంటే?
సరైన కథ ఉంటే భాషతో సంబంధంలో లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇక మన భాషలోనే ఆ సినిమా అందుబాటులో ఉంటే చూడకుండా ఉండగలరా?. ప్రస్తుతం చెప్పబోయే సినిమా ఏదో కాదు ‘సూపర్ డీలక్స్’ (Super Deluxe). ఈ సినిమా కూడా తెలుగులో సూపర్ హిట్ అయిన ‘వేదం’ (Vedam) తరహాలో నలుగురు వ్యక్తుల జీవితాలకు సంబంధించింది. ఇందులో సమంత, ఫహద్ ఫాజిల్, రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి, భగవతి పెరుమాళ్ వంటి స్టార్స్ నటించారు. ఎవరికి వాళ్లు ఎంతో సహజంగా నటింటి తమ పాత్రలకు జీవం పోశారు. తమిళంలో వచ్చిన ఈ చిత్రాన్ని లేటెస్ట్‌గా తెలుగులో చూసినవారంతా ఇంత కాలం ఎందుకు చూడలేదా అని బాధపడుతున్నారు. ఈ ‘సూపర్ డీలక్స్’ చిత్రం.. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌లో ఉంది.
కొడుకు కోసం వేశ్యగా రమ్యకృష్ణ!
ఈ మూవీలో రమ్యకృష్ణ పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఇందులో రమ్యకృష్ణ సెక్స్ వర్కర్‌గా నటించింది. కొడుకు భవిష్యత్ కోసం ఆమె వేశ్యగా చేస్తుంటుంది. అయితే ఒకరోజు తన ఫ్రెండ్స్‌తో కలిసి రమ్యకృష్ణ కొడుకు నీలి చిత్రాలు చూస్తుండగా.. అందులో నటించింది తన తల్లే అని తెలుసుకుని దిగ్భ్రాంతికి గురవుతాడు. ఆ తర్వాత రమ్యకృష్ణ జీవితం అవన్నీ తెర మీద చూస్తే మీరు ఎగ్జైట్ అవుతారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ట్రాన్స్ జెండర్‌గా చేసిన పాత్ర అందరి హృదయాలను పిండేస్తుంది. అతడు భార్య, కొడుకుని వదిలేసి ముంబయి వెళ్లి ట్రాన్స్ జెండర్‌గా మారతాడు. చాలా రోజులకు తిరిగి భార్యా- కొడుకు దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన సంఘటనలు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తాయి. నిజానికి ఈ మూవీలో ప్రతి పాత్ర కథ ఇంచుమించు అలాగే ఉంటుంది.
లవర్‌తో బెడ్రూంలో భర్తకు దొరికితే!
ఈ మూవీలోని మరో సబ్‌ప్లాట్‌లో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కనిపిస్తుంది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న పాత్రలో సమంత ఈ మూవీలో చేసింది. భర్తని కాదని మాజీ ప్రియుడితో శృంగారం చేస్తూ సమంత.. తన భర్త ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)కు దొరికిపోతుంది. ఈ క్రమంలో మాజీ ప్రియుడు చనిపోగా.. సమంత జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఇలా నలుగురు వ్యక్తులు (విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫహద్ ఫాజిల్) వారి కష్టాలు, జీవితాల గురించి సాగేదే ఈ సూపర్ డీలక్స్ చిత్రం. ఈ సూపర్ డీలక్స్ చిత్రం ఆహాలో అత్యధిక వీక్షణలతో సాగిపోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ ఇప్పటికీ సినిమా చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి?
కాస్త కామెడీ, కాస్త ఏమోషన్, కాస్త టెన్షన్ ఇలా సినిమా చూస్తున్నంత సేపు ఒక్కో రుచిని ప్రేక్షకుడు ఆస్వాదిస్తుంటాడు. మతానికి, మూఢనమ్మకానికి మధ్య ప్రజలు ఏ విధంగా చిక్కుకుపోతున్నారు? అసలు ట్రాన్స్ జెండర్లు ఎలా ప్రవర్తిస్తారు? కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఎలా తపన పడింది? ఏదైన కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే ఆ వ్యక్తుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా రూపొందించారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!