ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ పదం కామన్‌గా వినిపిస్తోంది. అదే పాన్ ఇండియా. మొన్నటివరకు ఒక ప్రాంతానికే పరిమితమైన సినిమా పరిధి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. ఎంగేజింగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఈ ఆలోచన సినిమా టైటిల్ ఖరారు చేయడం దగ్గర నుంచే మొదలవుతోంది. అలా పాన్ ఇండియాగా వచ్చిన, రాబోతున్న సినిమాల టైటిల్స్‌ని పరిశీలిస్తే ఓ కామన్ పాయింట్ అర్థమవుతుంది. ఈ టైటిల్స్ ఏ ఒక్క భాష, ప్రాంతానికే పరిమితం కాకుండా ఉంటోంది. అందరికీ తెలిసిన, బహు ప్రాచుర్యంలో ఉన్న పదాలను టైటిల్స్‌గా ఎంచుకుంటుండటం విశేషం.
సినిమాలో దమ్ముంటే కచ్చితంగా పరభాషా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు నమ్ముతున్నారు. ఈ భరోసాతోనే భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకొస్తున్నారు. అందుకు అనుగుణంగా మూవీ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నారు. పైగా, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను సినిమాలో చేర్చుకోవడం కూడా కలిసొస్తోంది. ఇలా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైటిల్స్ ఏంటో చూద్దాం.
RRR
ఆస్కార్ అవార్డు పొందిన సినిమా ‘RRR’. దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం. అయితే, వాస్తవానికి ఈ సినిమా టైటిల్‌ని ముందుగా ‘RRR’గా నిర్ణయించలేదు. రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న సినిమా గనుక వాడుకలో ఉండేందుకు ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుచుకున్నారు. క్రమంగా ఇది అందరినీ చేరుకుంది. జనాల నోళ్లలో బాగా నానింది. దీంతో ఇతర భాషల్లో కూడా సులువుగా అర్థమవుతుందని భావించి ఇదే టైటిల్‌ను కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మీకు తెలియంది కాదు.
KGF
రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం వచ్చేలా KGF అని కుదించి పెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా మూడో పార్ట్ కూడా భవిష్యత్తులో తెరకెక్కనుంది.
పఠాన్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ‘పఠాన్’ అనే పేరు అంతటా సుపరిచతమే. ఏ ప్రాంతంలోనైనా ఈ పేరు కలిగిన వారుంటారు. అందుకే సినిమాకు ఈ టైటిల్‌ని కంటిన్యూ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.
పుష్ప
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. అల్లు అర్జున్ క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మూవీ కోసం చాలా టైటిళ్లు అనుకున్నప్పటికీ.. క్యాచీగా, సులువుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేసింది. ఊహించినట్టుగానే ఈ మూవీ అన్ని భాషల్లో విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ జరుగుతోంది.
బ్రహ్మాస్త్ర
అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా కంటెంట్‌కు అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. పురాణాలకు భారత్ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తన అస్త్ర లోకాన్ని అందరికీ పరిచయం చేయాలని భావించి సినిమా ‘బ్రహ్మాస్త్ర’గా టైటిల్ ఖరారు చేశారు. ఇందులో మొదటి పార్ట్‌ని గతేడాది రిలీజ్ చేశారు. రెండు, మూడు పార్ట్‌లు రావాల్సి ఉంది.
బీస్ట్
దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా సైతం ఇతర భాషల్లో డబ్ అయింది. ఈ టైటిల్ అందరినీ ఆకర్షించింది. కానీ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కోలీవుడ్‌లో కాస్త మెరుగ్గా ఆడింది.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. సలార్ టైటిల్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతోంది.
OG
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. దీనికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ, చిత్రబృందం మొదటి నుంచి OG అనే పేరుతోనే ప్రచారం నిర్వహిస్తోంది. ఈ టైటిల్ ఇప్పటికే మార్మోగిపోయింది. ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసే సూచనలు ఉన్నాయి.
LEO
లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఇది. ‘లియో’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను సైతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ ఆధారంగా ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దసరా కానుకగా మూవీని రిలీజ్ చేయనున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!