ఆర్ ఎక్స్ 100 ఫేమ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన అందచందాలతో అభిమానుల మనసులు కొల్లగొడుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ మోడ్రన్ దుస్తులు ధరించి ఎప్పటికప్పుడూ ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు కొన్ని రీల్స్ రూపొందించి తన ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈమె ఓ ఇంగ్లీష్ పాటకు కొన్ని స్టిల్స్ ఇస్తూ వీడియో రూపొందించింది. సముద్రతీరంలో గాలి వేగానికి నాట్యం చేస్తున్న కురులను సరి చేసుకుంటూ కుర్రకారును పడగొట్టేలా ఓ నవ్వు నవ్వింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి లక్షా నలభై వేయిల లైకులొచ్చాయి.
దిల్లీకి చెందిన ఈ భామ తెలుగు తోపాటు, హిందీ, పంజాబీ, తమిళ్, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. తెలుగులో తొలి సినిమా ఆర్‌ఎక్స్ 100తోనే మంచి హిట్ సాధించి టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంది. వీరభద్రం డైరెక్షన్‌లో ఈమె హీరోయిన్‌గా నటించిన కిరాతక అనే సినిమా త్వరలో రిలీజ్‌కానుంది. అలాగే తమిళ చిత్రం గోల్‌మాల్, కన్నడ మూవీ హెడ్ బుష్ ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై కూడ ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో తాను వర్కౌట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. ఈమె ముంబైకి చెందిన మోడల్ సురభ్ డింగ్రాతో ప్రస్తుతం డేటింగ్‌లో ఉంది. వీరిద్దరిది చిన్ననాటి స్నేహమని, అలాగే అతను సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ