• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ vs  మెగా ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్వీట్ల వార్!

    ఈ జనరేషన్‌ మెగా హీరోలు అనగానే ముందుగా అందరికీ అల్లు అర్జున్‌ (Allu Arjun), రామ్‌చరణ్‌ (Ram Charan) గుర్తుకు వస్తారు. బన్నీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగితే.. రామ్‌ చరణ్‌ ‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) చిత్రంతో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాడు. వరసకు బావ బామ్మర్ది అయిన వీరిద్దరు.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. వీరి సినిమాలు వస్తుందంటే థియేటర్లు బద్దలు కావ్వాల్సిందే అన్న స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. అయితే బన్నీ, చరణ్‌.. ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద తలపడలేదు. కానీ, ‘పుష్ప 2’ వాయిదా వల్ల ఈ మెగా హీరోలు ఇద్దరూ బాక్సాఫీస్‌ బరిలో సవాలు విసురుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం. 

    ‘పుష్ప 2’ వాయిదా

    సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) చిత్రంలో ‘అల్లు అర్జున్’ హీరోగా నటిస్తున్నాడు. గతంలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించగా.. తాజాగా రిలీజ్‌ డేట్‌ను మారుస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. డిసెంబర్‌ 6న వరల్డ్‌ వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉన్నందున సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. 

    రేసులో గేమ్ ఛేంజర్‌!

    ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ పెండింగ్‌ ఉండటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ను రిలీజ్‌ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నారట. అయితే తొలుత సెప్టెంబర్‌లోనే చరణ్‌ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే సెప్టెంబర్‌ బరిలో ‘దేవర’, ‘NBK109’, ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాలు ఉండటంతో డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని దిల్‌రాజు ఫిక్స్‌ అయినట్లు తెలిసింది. కానీ, ఇప్పుడు సడెన్‌గా ‘పుష్ప 2’ డిసెంబర్ 6కు వాయిదా పడటంతో బాక్సాఫీస్‌ బరిలో అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

    అల్లు vs మెగా?

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్‌ చేసిన పనిపై మెగా ఫ్యాన్స్‌ కోపంగా ఉన్నారు. జనసేనాని పవన్‌కు వ్యతిరేకంగా నంధ్యాల వైకాపా అభ్యర్థి కోసం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్‌ చరణ్‌ – అల్లు అర్జున్‌ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడితే ఈ దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

    అల్లు ఆర్మీ సవాల్

    ఇదిలా ఉంటే మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది.  ‘పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్’, ‘బన్నీ vs రామ్ చరణ్’ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్‌ సవాలు చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్‌లో రియాక్ట్ అవుతూ ఛాలెంజ్‌ చేస్తున్నారు. ‘పుష్ప 2’ సినిమాను బ్యాన్ చేస్తామని మెగా అభిమానులు వార్నింగ్ ఇస్తుంటే.. దీనికి అల్లు అర్మీ గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. ఇరు ఫ్యాన్స్‌ల పోస్టులతో ‘మెగా vs అల్లు’ వివాదం నెట్టింట గట్టిగానే ట్రెండ్ అవుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv