తెలుగు సినిమా సత్తాను ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను కైవసం చేసుకొని భారతీయులను గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆస్కార్ ప్రచార ఆర్భాటాల కోసం రాజమౌళి రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు షికారు చేశాయి.మరోవైపు ఆస్కార్ ఎంట్రీ టికెట్ల కోసం రాజమౌళి రూ.1.44 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి తనయుడు కార్తికేయ చెక్ పెట్టారు. ఆస్కార్ ప్రమోషన్స్‌తో పాటు, టికెట్ కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారో తేటతెల్లం చేశారు.
ఆస్కార్‌కు వారికి మాత్రమే ఆహ్వానం!
అస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంట్రీకి రూ.1.44 కోట్లు ఖర్చయిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజమౌళి కుమారుడు కార్తికేయ స్పష్టం చేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు ఆస్కార్ వేడుకలకు అధికారిక ఆహ్వానితులుగా వెళ్లినట్లు తెలిపారు. కీరవాణి, చంద్రబోస్‌లు నామినేషన్స్‌లో ఉండటంతో వారికి ఫ్రీ ఎంట్రీ లభించిందని చెప్పారు. ఆస్కార్ నిర్వాహకులు నామినీల తరపున వెళ్లే వ్యక్తులకు కూడా కొన్ని సీట్లను కేటాయిస్తారని వివరించారు. అయితే సినిమాకు సంబంధించిన మిగతావాళ్లు డబ్బులు పెట్టి టికెట్లు కొనాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఆస్కార్ గ్యాలరీలో రెండు వరుసల్లో సెలబ్రెటీలు కూర్చుంటారని కార్తికేయ తెలిపారు. అప్పర్ లెవల‌్‌లో కూర్చునేందుకు ఒక్కో సీటుకు 750 డాలర్లు ఖర్చు పెట్టామని చెప్పారు. లోయర్ లెవల్‌లో కూర్చునేందుకు ఒక్కో సీటుకు 1500 డాలర్లు చెల్లించినట్లు వెల్లడించారు. అంతే కానీ ప్రచారం జరుగుతున్నట్లుగా కేవలం టికెట్ల కోసమే రూ.1.44కోట్లు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు.
అయితే ఆస్కార్ బరిలో నిలిచేందుకు నాటు నాటు సాంగ్, RRR మూవీ ప్రమోషన్స్ కోసం రూ.8.5 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
అంతకుముందు RRR ప్రమోషన్స్ సమయంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్కార్ కోసం ఆర్‌ఆర్‌ఆర్ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. అదే డబ్బుతో 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతామని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!