హీరో రామ్ చరణ్ ఉక్రెయిన్‌లోని తన సెక్యూరిటీ గార్డుకు చేసిన సహాయానికి అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. RRR నాటు నాటు పాటతో పాటు కొన్ని సన్నివేశాలను ఉక్రెయిన్‌లో చిత్రీకరించినట్లు ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడు రామ్ చరణ్ సెక్యూరిటీ చూసుకునే టీమ్‌లో రస్టీ అనే ఉక్రెయిన్ బాడీగార్డ్ కూడా ఉన్నాడు.
అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రామ్‌చరణ్ రస్టీకి ఫోన్ చేసి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. తన బాడీగార్డుకు ఆర్థిక సహాయం అందించాడు. ఈ విషయాన్ని స్వయంగా రస్టీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. నేను రామ్ చరణ్ బాడీగార్డ్‌గా కొన్ని రోజులే పనిచేశాను. కానీ అతడు మా గురించి ఆలోచించి మాకు సహాయం అందించాడు. నేను యుద్ధం కోసం ప్రస్తుతం మిలటరీలో చేరాను అని చెప్పాను. దాంతో నా భార్యకు అతడు డబ్బు పంపించాడు. రామ్ చరణ్‌ది చాలా మంచి మనసు అని వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో రామ్‌చరణ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్