తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే జంట చిరంజీవి-శ్రీదేవి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) చిత్రంలో వీరి కెమెస్ట్రీకి సినీ అభిమానులు దాసోహం అయ్యారు. ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ పాటలో చిరు-శ్రీదేవి వేసిన స్టెప్పులను ఇప్పటికీ టీవీల్లో చూస్తూ ఫిదా అవుతుంటారు. అయితే మూడు దశాబ్దాల తర్వాత వారి వారసులు జత కట్టబోతున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్ (Ram Charan) సరసన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటించబోతోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జోడీ ఒకప్పటి చిరు – శ్రీదేవి జంటను గుర్తు చేస్తుందని ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోయాయి.
జత కట్టే సినిమా అదే!
రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్‌ను తాజాగా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్‌ల తనయ జాన్వీకపూర్ (Janhvi Kapoor)ను చరణ్‌కు జోడీగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్ (Boney Kapoor) స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
‘దేవర’ను ఆస్వాదిస్తోంది’
తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలోనూ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాపై కూడా జాన్వీ తండ్రి బోనీకపూర్ తాజా ఇంటర్యూలో స్పందించారు. ‘దేవర సెట్‌లో ప్రతి క్షణాన్ని మా అమ్మాయి ఆస్వాదిస్తోంది. తన నటన, భాషను పెంచుకునేందుకు వీలు కుదిరినప్పుడల్లా జాన్వీ తెలుగు సినిమాలు చూస్తోంది. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఇద్దరే. వారి పక్కన నటించడం జాన్వీకి లభించిన మంచి అవకాశం. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాలని ఆకాంక్షిస్తున్నా. మరిన్ని చిత్రాల్లో నటించే అవకాశం జాన్వీకి రావాలి. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలాగే నా కుమార్తె కూడా నటించాలి’ అని అన్నారు.
సౌత్ ఇండస్ట్రీపై జాన్వీ కన్ను!
బాలీవుడ్‌లో తొమ్మిదికి పైగా చిత్రాల్లో నటించిన జాన్వీ కపూర్‌కు ఇప్పటివరకూ చెప్పుకోతగ్గ విజయం దక్కలేదు. దీనికి తోడు దీపికా పదుకొనే, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ల నుంచి జాన్వీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. దీంతో ఈ భామ దృష్టి దక్షిణాది చిత్ర పరిశ్రమపై పడింది. టాలీవుడ్ సహా పలు దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో వాటిలో నటించడం ద్వారా తన క్రేజ్ పెంచుకోవాలని జాన్వీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తారక్ సరసన ‘దేవర’, రామ్‌చరణ్ చిత్రాలతో పాటు తమిళ స్టార్ సూర్యతో కూడా మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాలు విజయం సాధిస్తే ఇక తన కెరీర్‌కు ఢోకా ఉండదని ఈ అమ్మడి ప్లాన్.
జాన్వీ.. మరో శ్రీలీల కానుందా!
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అంతా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లతో దాదాపుగా నటించారు. దీంతో వారితో సినిమాలు రూపొందిస్తున్న డైరెక్టర్లు కొత్త హీరోయిన్‌ను జోడీగా ఎంపిక చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీల (Sreeleela)కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. అంతకు ముందు ఉప్పెన (Uppena Movie) ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty)కి సైతం ఈ కోవలోనే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం కృతి శెట్టికి ఛాన్సెస్ లేకపోవడం.. శ్రీలీల నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో దర్శక నిర్మాతల దృష్టి ప్రస్తుతం జాన్వీ కపూర్‌పై పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతున్నట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జాన్వీ కపూర్ మరో శ్రీలీలగా మారవచ్చని అంటున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్