RRR మూవీ రిలీజ్‌తో ఒకవైపు థియేటర్లు సందడిగా మారితే.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సినిమా అద్భుతమని ఒకరు అంటే, అసలు బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు ఈ మూవీ సూపర్బ్ అంటూ రివ్యూ ఇచ్చాడు. కాని ప్రముఖ సినీ విమర్శకుడు కమలార్ఖాన్ మాత్రం RRR మూవీపై సంచలన ట్వీట్లు చేశాడు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదొక వరెస్ట్ మూవీ అని.. ఈ సినిమా చూస్తే మానవుడి మేధస్సు కూడ దెబ్బతింటుందని సంచలన రివ్యూ ఇచ్చాడు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంత వరెస్టె మూవీ అసలు రాలేదని పేర్కొన్నాడు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, మొగల్ ఈ ఆజాం మూవీలతో పొలిస్తే ఇది 0 శాతంతో నాకు సమానమని వరుస ట్వీట్లు చేశాడు. వరెస్ట్ డైరెక్షన్‌తో ప్రేక్షకులను మోసం చేసినందుకు రాజమౌళిని అరెస్టు చేసి ఆరునెలల జైలుశిక్ష విధించాలన్నాడు. ఈ చిత్రాన్ని తప్పుగా కాకుండా పెద్ద క్రైమ్‌గా భావించాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ట్వీట్లను మీరూ చూసేయండి.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి