టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) సోదరి పూజా కన్నన్ (Pooja Kannan) నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు.
జనవరి 21న పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ఈ విషయాన్ని పూజా పంచుకుంది. వాటికి సంబంధించిన ఫొటోలను సైతం పూజా షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
‘ఒక పెద్ద కుటుంబం.. నిండు హృదయాల ప్రేమ.. ఎప్పటికీ నాలో ఉంటాయి’ అని షేర్ చేసిన ఫొటోలకు పూజా ట్యాగ్ ఇచ్చింది.
ఇప్పటికే ఓ సినిమాలో హీరోయిన్గా చేసిన పూజా.. వినీత్ అనే యువకుడితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. త్వరలో వీరిద్దరి మ్యారేజ్ డేట్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు చెల్లెలి ఎంగేజ్‌మెంట్‌లో సాయి పల్లవి మెరిసిపోయింది. అంతా తానై ప్రతీ కార్యక్రమంలోనూ పాలు పంచుకుంది.
చెల్లి నిశ్చితార్థపు ఫంక్షన్లో సాయిపల్లవి తనదైన డ్యాన్స్తో దుమ్మురేపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పూజా సడెన్ ఎంగెజ్‌మెంట్ గురించి తెలుసుకొని సాయిపల్లవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అక్కకు పెళ్లి కాకుండా సోదరి పెళ్లికి సిద్ధం కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం సాయిపల్లవి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. కెరీర్‌పై ఫోకస్ పెట్టిన ఆమెకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలుస్తోంది. మరోవైపు చెల్లెలు పూజా మరో వ్యక్తిని ప్రేమించడంతో తల్లిదండ్రులు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పూజా కన్నన్ తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’ అనే మూవీలో నటించింది. ఆ సినిమాలో సముద్రఖని కూడా ప్రధాన పాత్ర పోషించాడు.
ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత పూజాకి మరో సినిమాలో నటించే అవకాశం రాలేదు.
ప్రస్తుతం సినిమాలు చేయకపోయినా సాయి పల్లవికి పర్సనల్ మేనేజర్‌గా ఉంటూ షూటింగ్‌లు, ప్రమోషన్స్‌ను దగ్గరుండి చూసుకుంటోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం